Ram Charan: రామ్ చరణ్ ఇది మామూలు అరాచకం కాదుగా..!

Advertisement

ప్రస్తుతం ఇండియా లో షారుఖ్ ఖాన్ ని మించిన సూపర్ స్టార్ లేడు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. వరుస ఫ్లాప్స్ మరియు డిజాస్టర్స్ రావడం వల్ల షారుఖ్ ఖాన్ కొంత కాలం గ్యాప్ తీసుకొని ఈ ఏడాది ప్రారంభం లో ‘పఠాన్’ సినిమా ద్వారా మన ముందుకు వచ్చాడు. ఈ సినిమా వెయ్యి కొలత రూపాయలకు పైగా గ్రాస్ ని కొల్లగొట్టి సంచలనం సృష్టించింది. ఈ చిత్రం తర్వాత ఇదే ఏడాది లో ఆయన చేసిన ‘జవాన్’ చిత్రం కూడా మరో వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టి సంచలనం సృష్టించింది.

ఇలా ఒకే ఏడాది రెండు సార్లు వెయ్యి కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టిన ఏకైక ఇండియన్ స్టార్ గా షారుఖ్ ఖాన్ చరిత్ర సృష్టించాడు. ఇక ఈ ఏడాది డిసెంబర్ 22 వ తారీఖున విడుదల అవ్వబొయ్యే ‘డుంకీ’ చిత్రం తో మూడవసారి కూడా వెయ్యి కోట్ల రూపాయిలు కొల్లగొట్టబోతున్నాడు. అలాంటి సూపర్ స్టార్ ని మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఒక విషయం లో చాలా తేలికగా దాటేసాడట.

ప్రస్తుతం ఆయన సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో ‘గేమ్ చేంజర్’ అనే సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ 70 శాతం కి పైగా పూర్తి అయ్యింది. శంకర్ సినిమా అంటే పాటలు ఎంత రిచ్ గా ఉంటాయో మనం చిన్నతనం నుండి చూస్తూనే ఉన్నాము. అలాగే ‘గేమ్ చేంజర్’ లో కూడా అదే స్టైల్ లో ఒక పాటని చిత్రీకరించారట.

ఇప్పటికే సోషల్ మీడియా లో లీక్ అయ్యి బాగా వైరల్ అయిన ‘జరగండి’ పాట చిత్రీకరణ కోసం 20 కోట్ల రూపాయిలు ఖర్చు చేశారట. ఇది ఇండియా లోనే అత్యంత ఖరీదైన పాట అని అంటున్నారు ట్రేడ్ పండితులు. షారుఖ్ ఖాన్ ‘జవాన్’ చిత్రం లోని ఒక పాట కోసం 15 కోట్ల రూపాయిలు ఖర్చు చేశారట, నిన్న మొన్నటి వరకు ఇండియా లో ఇదే మోస్ట్ కాస్ట్లీ సాంగ్. ఇప్పుడు ఆ రికార్డు ని ‘గేమ్ చేంజర్’ సాంగ్ బ్రేక్ చేసింది.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news