రామ్ చరణ్ ఉపాసనలకు అంత భక్తా… ఎక్కడికి వెళ్లినా పూజ చేయాల్సిందేనా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉంటూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వీరి అలవాట్లు పద్ధతులు ఎంతోమందికి స్ఫూర్తిగా ఉంటాయని చెప్పాలి. మెగా ఇంటికోడలైన ఒక స్టార్ హీరో భార్య అయినా ఉపాసన ఏమాత్రం గర్వం లేకుండా ఎంతో వినయంగా ఉంటూ ఎందరికో ఆదర్శంగా ఉన్నారని చెప్పడంలో సందేహం అవసరం లేదు. ఇక ఈ దంపతులు తరచూ పూజా కార్యక్రమాలలో పాల్గొనడం కూడా మనం చూస్తున్నాము.

అయితే రామ్ చరణ్ ఉపాసన దంపతులకు దైవభక్తి చాలా ఉందని మరోసారి నిరూపించుకున్నారు. రామ్ చరణ్ ప్రతి ఏడాది మాల ధరిస్తూ తనలో ఉన్నటువంటి భక్తిని చాటి చెబుతూ ఉంటారు. ఇక రాంచరణ్ ఉపాసన భారత దేశంలోనే కాకుండా ఇతర ఏ ప్రాంతాలకు వెళ్లిన వారితోపాటు వారి ఇంటి దేవాలయాన్ని కూడా తీసుకువెళ్తారని తెలుస్తుంది. రామ్ చరణ్ ఉపాసన దంపతులు వారి ఇంటి దేవుడికి సంబంధించిన విగ్రహాలను వారు ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకువెళ్లడమే కాకుండా వారు ఉన్న ప్రదేశంలో ఆ విగ్రహాలతో చిన్న ఆలయాన్ని ఏర్పాటు చేసుకొని పూజలు కూడా చేస్తారని తెలుస్తోంది.

ఇలా తాము ఎక్కడికి వెళ్లినా ఈ ఆలయాన్ని తమతో పాటే తీసుకెళ్తామని రామ్ చరణ్ తెలిపారు. ఇలా తీసుకెళ్లడం వల్ల తాము ఎక్కడున్నా భారతదేశంతో కనెక్ట్ అవ్వడానికి దేవుడు తమకు సహాయం చేస్తారనే నమ్మకం వారికి ఉందని చరణ్ తెలిపారు. ఇక తాజాగా ఆస్కార్ అవార్డు వేడుకలలో భాగంగా రాంచరణ్ ఉపాసన దంపతులు ఇద్దరు కూడా ఈ వేడుకకు తయారై బయటకు వెళ్లే ముందు ఈ ఆలయం ముందు స్వామివారికి పూజ చేసి నమస్కరించుకొని బయలుదేరారు.

ఇందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇలా వీరు ఏ ప్రదేశానికి వెళ్ళిన బయటకు వెళ్లే ముందు తప్పనిసరిగా ఈ దేవుడి విగ్రహాలకు పూజ చేసే ప్రార్థించే వెళ్తారని తెలుస్తుంది. ఇలా రామ్ చరణ్ ఉపాసన దంపతులకు ఉన్నటువంటి ఈ అలవాటు తెలిసి అభిమానులు ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus