Ram Charan: ‘పెద్ది’ లో చరణ్ లుక్ వెనుక అంత కథ ఉందా?

మెగా పవర్ స్టార్ రాంచరణ్ (Ram Charan) పుట్టినరోజు నేడు. ఈరోజుతో అతను 40వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాడు. దీంతో అభిమానులు అతని బర్త్ డే సెలబ్రేషన్స్ ను గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల గుళ్లో అర్చనలు, అన్నదానాలు, చిరంజీవి బ్లడ్ క్యాంపులో రక్తదానాలు వంటివి చేస్తూ ఎంతో మంది అభిమానులకి ఆదర్శంగా నిలుస్తున్నారు అభిమానులు. ఇక రాంచరణ్ అభిమానులకి గిఫ్ట్ గా ‘#RC16’ మేకర్స్ ఓ ఫస్ట్ లుక్ పోస్టర్ ను వదిలారు.

Ram Charan

ఈ సినిమాకి ‘పెద్ది’ (Peddi)  అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు కూడా పోస్టర్ ద్వారా తెలిపారు. ఇక ఈ లుక్లో రామ్ చరణ్ ఊర మాస్ అవతార్లో కనిపిస్తున్నాడు. గుబురు గడ్డం, లాంగ్ హెయిర్ తో పాటు ముక్కుకి రింగ్ కూడా ఉండటం గమనించవచ్చు. ఇక చరణ్ లుక్ తో అభిమానులు ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు. మరికొంత మంది రెండు పోస్టర్లలో ఒక పోస్టర్ ‘పుష్ప’లానే ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

వీటిని పక్కన పెట్టేస్తే.. ‘పెద్ది’ లుక్ కోసం చరణ్ చాలా కష్టపడ్డాడు. జిమ్లో చాలా కష్టపడి బాడీ పెంచాడు. అలాగే పాత్ర కోసం అతను తన డైట్ కూడా మార్చుకున్నట్టు సమాచారం. ఈ సినిమా కోసం చరణ్ ఏకంగా 12 కేజీల బరువు పెరిగాడు అనేది ఇన్సైడ్ టాక్. అలా అని ఒళ్ళు చేసినట్టు ఉండకూడదు. ఎందుకంటే ఇందులో అతను ఆట కూలీగా కనిపించబోతున్నాడు.

ఒక పల్లెటూరికి చెందిన మొరటు మనిషిలా కూడా కనపడాలి కాబట్టి.. చరణ్ ఇలా మారినట్టు స్పష్టమవుతుంది. ఈ సినిమాలో మెయిన్ హైలెట్ అంతా చరణ్ అవుతాడనేది ఇన్సైడ్ టాక్. కచ్చితంగా ఈ పాత్ర అతని కెరీర్లో ది బెస్ట్ అనేలా ఉంటుందని, కచ్చితంగా అతనికి నేషనల్ అవార్డు వస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus