టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన RRR సినిమా పాన్ ఇండియా స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇక ఈ సినిమా ఆస్కార్ అవార్డు నామినేషన్ లో నిలిచిన సంగతి మనకు తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాలోని నాటు నాటు పాటకు గాను తాజాగా గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం విశేషం.ఇక ఈ అవార్డును అందుకోవడం కోసం చిత్ర బృందం మొత్తం అమెరికా వెళ్లిన విషయం మనకు తెలిసిందే.
ఇలా అమెరికా పర్యటనలో ఉన్నటువంటి ఈ చిత్ర బృందం అక్కడ పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఈ సినిమా గురించి పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రామ్ చరణ్ ఈ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ సినిమాలోని నాటు నాటు పాట షూటింగ్ జరుగుతున్న సమయంలో తాను గాయపడ్డానని చరణ్ తెలిపారు. ఈ విధంగా తనకు గాయం కావడంతో సుమారు మూడు నెలల పాటు షూటింగ్ కి దూరంగా ఉన్నానని
అనంతరం ఉక్రెయిన్ లో జరుగుతున్నటువంటి నాటు నాటు షూటింగ్ లో పాల్గొన్నాననీ తెలిపారు. ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా హాలీవుడ్ హీరోల గురించి మాట్లాడుతూ..హాలీవుడ్ నటులు బ్రాడ్ పిట్, టామ్ క్రూజ్ తనకు స్ఫూర్తి అని రామ్ చరణ్ వెల్లడించారు.ఈ హీరోలు చేసిన సినిమాలు తాను ఎప్పుడు కూడా మిస్ కానని, వీరు వయసు పై బడే కొద్దీ అభిమానులను సంపాదించుకుంటున్నారు అంటూ ఈ సందర్భంగా రామ్ చరణ్ తెలియజేశారు.
ఇలా ఈ ఇంటర్వ్యూ సందర్భంగా రామ్ చరణ్ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత ఈయన ఏకంగా ఆరు సినిమాలను లైన్లో పెట్టి వరుస సినిమాలతో బిజీ అయ్యారు.