మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ‘ఆర్.ఆర్.ఆర్’ తో అది దేశాలు దాటింది. ఈ మధ్యనే ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం జపాన్ లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ప్రమోషన్ల కోసం దర్శకుడు రాజమౌళి.. ‘ఆర్.ఆర్.ఆర్’ టీంతో అక్కడ వాలిపోయాడు. రాజమౌళి తో పాటు అతని కొడుకు కార్తికేయ ఫ్యామిలీ, ఎన్టీఆర్ ఫ్యామిలీ, రాంచరణ్ ఫ్యామిలీ.. ఇలా అందరూ జపాన్ వెళ్లారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇక జపాన్ ప్రజలు కూడా ఆర్.ఆర్.ఆర్ టీంకి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. హాలీవుడ్ హీరోలను రిసీవ్ చేసుకున్నట్టు మన చరణ్, ఎన్టీఆర్ లను రిసీవ్ చేసుకున్నారు. అక్కడి మీడియా వారు కూడా చరణ్, ఎన్టీఆర్ ల ఫోటోగ్రాఫ్ లు, ఆటోగ్రాఫ్ లు తీసుకోవడానికి ఎగబడ్డారు. అయితే ఈ ఇద్దరి హీరోలు ఎంతో ఓపిగ్గా వారికి ఆటోగ్రాఫ్ లు, ఫోటోగ్రాఫ్ లు ఇచ్చారు. ఇదే క్రమంలో రాంచరణ్.. ఓ జపాన్ అభిమాని కలుసుకుంది.
ఈమె వయసు 70 ఏళ్లకు పైనే ఉంటుంది. ఆమె పేరు నోరికో కాసై. ఈమె రాంచరణ్ చిత్రాల్లోని అతని లుక్స్ ను పెయింటింగ్ వేసి అవి చరణ్ కి చూపించింది.’చిరుత’ నుండి ‘మగధీర’ అలా ‘ఆర్.ఆర్.ఆర్’ వరకు చరణ్ లుక్స్ ను ఈమె యాజ్ ఇట్ ఈజ్ గా దింపేసింది. ఆ పెయింటింగ్స్ కు, నోరికో అభిమానానికి చరణ్ ఫిదా అయిపోయాడు.
అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. చరణ్ అభిమానులు కూడా వీటిని లైక్ చేస్తూ షేర్ చేస్తున్నారు. మన టాలీవుడ్ హీరోలకు పక్క దేశాల్లో కూడా ఈ రేంజ్ లో అభిమానులు ఉండటం నిజంగా హర్షించదగ్గ విషయమే..!