Ram Charan: రామ్ చరణ్ ‘పెద్ది’.. నైజాం మార్కెట్‌లో బిజినెస్ ఎలా ఉంది?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో వస్తున్న ‘పెద్ది’ మూవీపై అంచనాలు నెక్స్ట్ లెవల్‌లో ఉన్నాయి. షూటింగ్ స్టేజ్‌లోనే ఈ సినిమా బిజినెస్ లెక్కలు టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా నైజాం ఏరియా హక్కుల కోసం బడా డిస్ట్రిబ్యూటర్ల మధ్య గట్టి పోటీ నెలకొంది. చరణ్ మాస్ ఇమేజ్, ‘ఉప్పెన’ తర్వాత బుచ్చిబాబు చేస్తున్న సినిమా కావడంతో ఈ ఏరియాలో కళ్లు చెదిరే రేట్లు వినిపిస్తున్నాయి.

Ram Charan

నైజాం హక్కుల కోసం మైత్రీ మూవీ మేకర్స్ ఏకంగా 60 కోట్ల నుండి 65 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. చరణ్ కెరీర్‌లోనే ఒక రీజినల్ ప్రాజెక్ట్‌కు ఈ స్థాయి రేటు పలకడం ఇదే మొదటిసారి. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఎమోషనల్ డ్రామా కావడంతో, నైజాం ఆడియన్స్‌కు ఇది బాగా కనెక్ట్ అవుతుందని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. అందుకే రేట్ల విషయంలో అస్సలు తగ్గడం లేదు.

అయితే డిస్ట్రిబ్యూటర్ల వైపు నుంచి మాత్రం బేరసారాలు గట్టిగానే సాగుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్ కండిషన్స్, థియేటర్ల లెక్కలను బట్టి 50 కోట్ల వరకు ఇచ్చేందుకు కొందరు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మేకర్స్ అడిగే రేటుకు, డిస్ట్రిబ్యూటర్లు చెప్పే దానికి మధ్య దాదాపు 15 కోట్ల వరకు గ్యాప్ ఉంది. దీంతో ఈ డీల్ క్లోజ్ అవ్వడానికి మరికొంత టైమ్ పట్టేలా కనిపిస్తోంది. దిల్ రాజు లాంటి పెద్ద పంపిణీదారులు ఈ రేసులోకి వస్తే సీన్ మారే ఛాన్స్ ఉంది.

చరణ్ గ్లోబల్ ఇమేజ్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో రిస్క్ చేయడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ పెట్టిన పెట్టుబడి వెనక్కి రావాలంటే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ‘ఆర్ఆర్ఆర్’ రేంజ్ వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, జాన్వీ కపూర్ హీరోయిన్ కావడంతో సినిమాపై నేషనల్ లెవల్లో బజ్ ఉంది. ఈ బజ్ చూస్తుంటే మేకర్స్ అనుకున్న రేటుకే డీల్ సెటిల్ అయ్యేలా ఉందని టాక్ వినిపిస్తోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus