మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఆచార్య, ఆర్ఆర్ఆర్ సినిమాలు కొన్ని నెలల గ్యాప్ లోనే రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు మల్టీస్టారర్ సినిమాలు కాగా అపజయం ఎరుగని దర్శకులు కొరటాల శివ, రాజమౌళి ఈ సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే రెండు రోజుల క్రితం చరణ్ ముంబైలో బంగ్లా కొనుగోలు చేసినట్టు ఒక వార్త తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. చరణ్ అకస్మాత్తుగా బంగ్లా కొనుగోలు చేయడానికి ముఖ్యమైన కారణమే ఉందని సమాచారం.
ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకోనున్న చరణ్ పాన్ ఇండియా కథలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. గతంలోనే జంజీర్ తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన చరణ్ కు ఆ సినిమా రిజల్ట్ నిరాశను మిగిల్చింది. ఆర్ఆర్ఆర్ తర్వాత నటించే సినిమాలతో బాలీవుడ్ లో హీరోగా మార్కెట్ ను పెంచుకోవాలని చరణ్ భావిస్తున్నారు. ముంబైకు వెళ్లిన ప్రతిసారి హోటల్స్ లో ఉండాల్సి వస్తుండటంతో ఖరీదైన ఇంటిని చరణ్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే చరణ్ ఉపాసన గృహ ప్రవేశం కూడా చేశారని బీచ్ ఫేసింగ్ లో ఈ బంగ్లా ఉందని సమాచారం. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న పాన్ ఇండియా మూవీలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ సీఎంగా కనిపిస్తారని వార్తలు వస్తుండగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరోలలో ఒకరైన రామ్ చరణ్ బాలీవుడ్ లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకుంటారేమో చూడాలి ఉంది.