Ram Charan: మూవీ ఫ్లాపైతే చరణ్ పార్టీ చేసుకుంటారా.. షాకింగ్ విషయాలు రివీల్!

టాలీవుడ్ స్టార్ హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)  సినీ కెరీర్ లో ఫ్లాప్ సినిమాల కంటే హిట్ సినిమాలు ఎక్కువనే సంగతి తెలిసిందే. కెరీర్ పరంగా చరణ్ అంతకంతకూ ఎదుగుతుండగా గేమ్ ఛేంజర్ (Game Changer)  సినిమాతో చరణ్ మరో కెరీర్ బెస్ట్ హిట్ అందుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సినిమా ఫలితాలకు సంబంధించి తాజాగా మాట్లాడిన రామ్ చరణ్ ఫలితాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒత్తిడి ఎలా తీసుకోవాలో నాకు తెలియదని సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ పొందనప్పుడు కూడా నేను రిలాక్స్ కావడం కోసం పార్టీ చేసుకుంటానని చరణ్ తెలిపారు.

ఆర్.ఆర్.ఆర్ (RRR) మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన తర్వాత కూడా నేను వారం రోజుల పాటు బయటకు రాలేదని చరణ్ పేర్కొన్నారు. ఆ సమయంలో నేను ఫ్యామిలీతో ఎంజాయ్ చేశానని చరణ్ చెప్పుకొచ్చారు. వారసతం గురించి నేను ఎక్కువగా ఆలోచించనని ప్రస్తుతం ఏం జరుగుతుందో దానిపై దృష్టి పెట్టానని చరణ్ పేర్కొన్నారు.

అదే నాకు ముఖ్యమని ఒక తండ్రిగా, ఫాదర్ గా, బ్రదర్ గా ఈరోజు నా బాధ్యతలకు పూర్తిగా న్యాయం చేయగలిగానా లేదా అనేది ముఖ్యమని ప్రతిరోజూ ఇలాగే ఆలోచిస్తానని రామ్ చరణ్ పేర్కొన్నారు. మరోవైపు పుష్ప ది రూల్ డిసెంబర్ కు వాయిదా పడిన నేపథ్యంలో గేమ్ ఛేంజర్ రిలీజ్ గురించి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలు అన్నీ వాయిదా పడుతుండటం సినీ అభిమానులను కలవరపెడుతోంది.

చరణ్ పారితోషికం 100 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉందని సమాచారం అందుతోంది. రామ్ చరణ్ ఇతర భాషల్లో సైతం సక్సెస్ సాధించాలని అంతకు మించి విజయాలను సొంతం చేసుకున్నారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. చరణ్ త్వరలో మరిన్ని ప్రాజెక్ట్స్ ను ప్రకటిస్తారేమో చూడాల్సి ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus