టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుండగా ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారనే ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది. రామ్ చరణ్ 16వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీకి సతీష్ అనే కొత్త నిర్మాత పని చేస్తున్నారు. ఈ నిర్మాత తాను ఎక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేయలేనని చెప్పడంతో చరణ్ బుచ్చిబాబు ఈ సినిమాకు లాభాల్లో వాటా తీసుకోనున్నారని తెలుస్తోంది.
ఈ సినిమాకు పూర్తిస్థాయిలో బిజినెస్ జరిగిన తర్వాత మాత్రమే లాభాల్లో వాటా తీసుకోనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. రామ్ చరణ్ రెమ్యునరేషన్ 100 కోట్ల రూపాయలు కాగా బుచ్చిబాబు రెమ్యునరేషన్ పరిమితంగానే ఉంది. చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోంది. చరణ్ కెరీర్ విషయంలో పొరపాట్లు జరగకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. స్క్రిప్ట్ వర్క్ కు దర్శకులు ఎక్కువగా సమయం కేటాయించే దిశగా అడుగులు వేస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
చరణ్ భవిష్యత్తులో హాలీవుడ్ ప్రాజెక్ట్ లలో కూడా నటించాలని ఆశ పడుతున్నారు. ఇతర హీరోలతో సైతం చరణ్ సన్నిహితంగా మెలుగుతున్నారు. రామ్ చరణ్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా చిరంజీవి, చరణ్ కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. చరణ్ ప్రస్తుతం శంకర్ సినిమాలో నటిస్తుండగా
త్వరలో ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర అప్డేట్స్ రానున్నాయని తెలుస్తోంది. తర్వాత సినిమాలతో చరణ్ బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. కథ నచ్చితే రామ్ చరణ్ ఇతర హీరోలతో కలిసి నటించడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నారు.
సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?
టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?