Ram Charan: ఆ బయోపిక్ లో యాక్ట్ చేస్తా.. చరణ్ కామెంట్స్ వైరల్!

  • March 18, 2023 / 01:35 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించడంతో పాటు తన ఇష్టాయిష్టాలను తారక్ తో ఉన్న స్నేహ బంధాన్ని వెల్లడించారు. నాకు, తారక్ కు మధ్య ఉన్న స్నేహం వల్లే ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో మేమిద్దరం హీరోలుగా సెలెక్ట్ అయ్యామని చరణ్ కామెంట్లు చేశారు. ఆర్‌ఆర్‌ఆర్‌ స్టోరీ కూడా ఇద్దరు ఫ్రెండ్స్ కు సంబంధించిన కథ అని చరణ్ చెప్పుకొచ్చారు. ఆర్‌ఆర్‌ఆర్‌ లాంటి కథకు నేను, తారక్ కరెక్ట్ గా సూట్ అవుతామని భావించి రాజమౌళి మమ్మల్ని ఎంపిక చేయడం జరిగిందని రామ్ చరణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీతో జక్కన్న మ్యాజిక్ చేశారని టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆస్కార్ అవార్డ్ ను సొంతం చేసుకున్న మూవీ ఇదేనని నాటు నాటు సాంగ్ పాపులర్ కావడం వెనుక ఎంతోమంది కష్టం ఉందని రామ్ చరణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. జక్కన్న నాకు, తారక్ కు స్వీట్ టార్చర్ చూపించారని చరణ్ చెప్పుకొచ్చారు. మా అందరి కష్టానికి ఫలితంగా ఆస్కార్ వచ్చిందని చరణ్ పేర్కొన్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ రెండు కళ్లు అని రామ్ చరణ్ అన్నారు.

సినిమాల పరంగా, ఫ్యాన్స్ పరంగా తారక్ కుటుంబంతో పోటీ ఉందని వ్యక్తిగతంగా మాత్రం ఎలాంటి పోటీ లేదని ఆయన అన్నారు. వర్క్ విషయంలో రాజమౌళి మిస్టర్ పర్ఫెక్ట్ అని చరణ్ చెప్పుకొచ్చారు. నాన్న, బాబాయ్ తర్వాత నేను ఆ స్థాయిలో గౌరవించే వ్యక్తి రాజమౌళి అని చరణ్ తెలిపారు. ఇష్టమైన కోస్టార్ ఎవరనే ప్రశ్నకు స్పందిస్తూ కియారా అద్వానీ పేరును చరణ్ సమాధానంగా చెప్పారు.

స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కథలో నటించాలని ఉందని విరాట్ కోహ్లీ బయోపిక్ లో నటించే ఛాన్స్ వస్తే వదులుకోనని చరణ్ తెలిపారు. రాజస్థాన్ స్విట్జర్లాండ్ ఫేవరెట్ టూరిస్ట్ ప్లేస్ లని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో చరణ్ బిజీ అవుతున్నారు.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus