Ram Charan, Shankar: శంకర్ మూవీలో చరణ్ పాత్ర అలా ఉండనుందా?

  • November 10, 2021 / 05:03 PM IST

శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం నిర్మాత దిల్ రాజు డబ్బును మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నారు. ఈ సినిమాలోని ట్రైన్ సీన్ కోసం ఏకంగా 70 కోట్ల రూపాయలు ఖర్చైందని తెలుస్తోంది. చరణ్ ఈ సినిమాలో సీబీఐ ఆఫీసర్ గా కనిపించనున్నారని సమాచారం. అయితే సీబీఐ ఆఫీసర్ జేడీ లక్ష్మీనారాయణ పాత్రలాంటి పాత్రను చరణ్ చేస్తున్నారని తెలుస్తోంది.

ఈ సినిమాలో చరణ్ కు జోడీగా కియారా అద్వానీ నటిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు జేడీ లక్ష్మీనారాయణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బళ్లారి గాలి జనార్ధన్ రెడ్డి కేసు ద్వారా జేడీ లక్ష్మీనారాయణకు పాపులారిటీ పెరిగింది. మరి చరణ్ పాత్ర జేడీ లక్ష్మీనారాయణ నిజ జీవితాన్ని పోలి ఉంటుందా? లేదా? తెలియాలంటే మాత్రం మరికొన్ని నెలలు ఆగాల్సిందే. సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరోలలో ఒకరైన చరణ్ వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నారు.

థమన్ శంకర్ చరణ్ కాంబో మూవీకి మ్యూజిక్ అందిస్తుండగా శ్రీకాంత్, అంజలి ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో కమర్షియల్ అంశాలతో పాటు మెసేజ్ ఉండేలా శంకర్ జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వస్తుందని చరణ్ భావిస్తున్నారు. ఈ సినిమాలోని అల్లూరి సీతారామరాజు పాత్ర తన కెరీర్ లో బెస్ట్ రోల్ గా నిలుస్తుందని చరణ్ భావిస్తున్నారు.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus