రాంచరణ్- శంకర్ ల మూవీ స్టోరీ లైన్ అదేనట…!

‘ఆర్.ఆర్.ఆర్’ పూర్తయిన వెంటనే కోలీవుడ్ స్టార్ దర్శకుడు శంకర్ డైరెక్షన్లో సినిమా చెయ్యడానికి ఓకే చెప్పాడు రాంచరణ్. మరో పక్క శంకర్ తెరకెక్కించాల్సిన ‘ఇండియన్2’ ప్రస్తుతం హోల్డ్ లో పడింది. దాంతో చరణ్ కోసం ఓ కథను సిద్ధం చేసుకుని.. ఈ మధ్యనే అతనికి వినిపించి ఓకే చేయించుకున్నాడు దర్శకుడు శంకర్. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత. ఇక ఈ ప్రాజెక్టు సెట్ అయ్యింది అని తెలియాగానే సోషల్ మీడియాలో ఈ చిత్రం కథ ఇదేనంటూ డిస్కషన్లు జరుగుతున్నాయి.

ఇది ఒక మల్టీ స్టారర్ అని..మరో హీరోగా కె.జి.ఎఫ్ యష్ నటిస్తున్నాడంటూ రూమర్స్ వస్తున్నాయి. అయితే వీటిలో నిజం లేదనేది తాజా సమాచారం.చరణ ఒక్కడే ఈ సినిమాలో హీరో అని టాక్. అందుతున్న సమాచారం ప్రకారం.. చరణ్ – శంకర్ ల సినిమా ఓ పొలిటికల్ థ్రిల్లర్ అని తెలుస్తుంది. ఓ వైపు సామాజిక అంశాన్ని టచ్ చేస్తూనే చరణ్ ఫ్యాన్స్ కు అలాగే మాస్ ఆడియెన్స్ కు కావాల్సినన్ని యాక్షన్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉంటాయట.

అయితే భారీ భారీ సెట్టింగులు అలాగే వి.ఎఫ్.ఎక్స్ వర్కులు వంటివి ఈ ప్రాజెక్ట్ లో భాగం కావని తెలుస్తుంది. అయితే ఈ చిత్రం కూడా గ్రాండ్ గానే ఉంటుందట.ప్రస్తుతం ఈ చిత్రానికి బడ్జెట్ ఎంత పెట్టాలి.. అగ్ర నటీనటులను ఎలాంటి వారిని ఎంపిక చేసుకోవాలి అనే విషయం పై చెన్నైలో నిర్మాత దిల్ రాజు అలాగే శంకర్ లు డిస్కస్ చేసుకుంటున్నారు.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus