సోనూ సూద్ విలన్‌గా నటించడం ఒకప్పుడు చాలా చిన్న విషయమే కావొచ్చు. ఇప్పుడు నేషనల్ స్టార్ అయిపోయాక చాలా పెద్ద విషయమే. అయితే పని పట్ల అతనికున్న నిబద్ధతతో విలన్ పాత్రలు చేస్తూ… పని పనే, సేవ సేవే అని చెప్పకనే చెబుతున్నారాయన. అయితే ఇప్పుడు సోనూని మరీ తక్కువ చేసేలా విలన్ పాత్రలు రాసుకోవడం అంత మంచిది కాదేమో. దీంతో సోనూను ఇప్పుడు హ్యాండిల్ చేయడం కష్టమే అంటున్నారు. ఇమ్మీడియట్‌గా ఈ సమస్య ఎదుర్కొంటున్న దర్శకుడు కొరటాల శివే.
‘ఆచార్య’లో సోనూ సూద్ విలనిజం పండించబోతున్నాడు. అందులో చిరంజీవి, రామ్ చరణ్‌తో సోనూ సూద్ ఫైట్స్ చేసే సీన్లు ఉన్నాయట. వాటిని చాలా ఇంట్రెస్టింగ్గా తీర్చిదిద్దుతోందట చిత్రబృందం. తాజాగా సినిమా చిత్రీకరణలో ఆఖరి షెడ్యూల్ మొదలైంది. ఇందులో రామ్‌చరణ్, సోనూ సూద్‌పై ఓ ఫైట్ చిత్రీకరిస్తారని తెలుస్తోంది. ధర్మస్థలిలోనే ఈ మల్లయుద్ధం ఫైట్ ఉండబోతోందట. దీంతో ఈ ఫైట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. కరోనా పరిస్థితులు లేకపోయుంటే..
ఈ సినిమా విడుదలై సుమారు రెండు నెలలు అయ్యేది. అయితే ఇప్పుడు షూటింగ్ ఆఖరి షెడ్యూల్ మొదలైంది. వీలైనంత త్వరగా సినిమా పూర్తి చేసి… చిరంజీవి పుట్టిన రోజు కానుకగా ఆగస్టు 20న విడుదల చేస్తారని వార్తలొస్తున్నాయి. ఇందులో నిజానిజాలు ఎంతో తెలియదు కానీ… అలా సినిమా వస్తే అభిమానులకు ఆనందమే ఆనందం.