Ram Charan Watch Cost: వామ్మో.. హీరో రామ్ చరణ్ వాచ్ ఖరీదు అన్ని కోట్లా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాకు సంబంధించి ఈ మధ్య కాలంలో ఎలాంటి అప్ డేట్స్ రావడం లేదు. అదే సమయంలో గేమ్ ఛేంజర్ మూవీ థియేటర్లలో ఎప్పుడు విడుదలవుతుందనే ప్రశ్నకు సంబంధించి కూడా సమాధానం దొరకడం లేదనే సంగతి తెలిసిందే. చరణ్ కూడా గేమ్ ఛేంజర్ సినిమా విషయంలో సైలెంట్ గా ఉన్నారు.

తాజాగా చరణ్ కు కూతురు జన్మించడంతో మెగా కుటుంబంలో సంబరాలు అంబరాన్ని తాకాయి. అయితే ఉపాసన డిశ్చార్జ్ సమయంలో చేతికి పెట్టుకున్న వాచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రిచర్డ్ మిల్లే బ్రాండ్ కు సంబంధించిన ఈ వాచ్ ఖరీదు కోటీ 62 లక్షల రూపాయలు అని తెలుస్తోంది. ఇప్పటికే రామ్ చరణ్ దగ్గర ఎన్నో లగ్జరీ వస్తువులు ఉన్నాయని సమాచారం అందుతోంది. చరణ్ దగ్గర ఉన్న ఆ వస్తువుల ధర కూడా ఎక్కువేనని సమాచారం.

రామ్ చరణ్ కు సొంతంగా ఒక ప్రైవేట్ జెట్ కూడా ఉంది. రామ్ చరణ్ కు సొంతంగా ఖరీదైన కార్లు కూడా ఉన్నాయని సమాచారం అందుతోంది. రామ్ చరణ్ ఉపాసన ఆస్తుల విలువ 2500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తమని సమాచారం అందుతోంది. చరణ్ , ఉపాసనలకు క్రేజ్ కూడా అంతకంతకూ పెరుగుతోంది. రామ్ చరణ్ విభిన్నమైన కథ, కథనం ఉన్న సినిమాలకు ఓటేస్తున్నారు.

సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న టాలీవుడ్ స్టార్ హీరోలలో రామ్ చరణ్ ఒకరిగా ఉన్నారు. రామ్ చరణ్ తండ్రిని మించిన తనయుడిగా ఎదగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రామ్ చరణ్ 150 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి ఎదగాలని హాలీవుడ్ లో కూడా చరణ్ సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus