మళ్ళీ వాయిదాపడిన “ధృవ”

  • May 27, 2016 / 06:39 AM IST

మొన్నటివరకూ తన రెండో చెల్లెలి రెండో పెళ్లి హడావుడి, ఆ తర్వాత తన తండ్రి రీఎంట్రీ సినిమా నిర్మాణం ఇలా ఏదో ఒక పనిలో యమ బిజీగా చరణ్ గడుపుతుండడంతో.. ఈపాటికే రెండు షెడ్యూల్స్ పూర్తి కావాల్సిన చరణ్ తాజా చిత్రం “ధృవ” ఇప్పటివరకూ ఒక్క షెడ్యూల్ కూడా పూర్తవ్వలేదు. విలన్ మరియు హీరోయిన్లపై కొన్ని సీన్స్ ను పిక్చరైజ్ చేసినప్పటికీ.. అవి చిన్న షెడ్యూల్స్. ఇప్పటికే ఈ లేట్ కారణంగా కెమెరామెన్ కూడా మారిపోయాడు. తొలుత ఈ చిత్రం కోసం బాలీవుడ్ నుంచి “భజరంగీ భాయిజాన్”కు కెమెరామెన్ గా వర్క్ చేసిన మిశ్రాను ఎంపిక చేశారు. షెడ్యూల్ నెలల తరబడి పోస్ట్ పోన్ అవుతుండడంతో.. ఆయన తప్పుకొన్నాడు. ఇప్పుడు ఆయన స్థానంలో పి.ఎస్.వినోద్ వచ్చాడు.

అలాగే.. ఈ సినిమా తాజా షెడ్యూల్ కాశ్మీర్ లో జూన్ మొదటివారంలో మొదలుకావాల్సి ఉంది. కానీ.. జూన్ 6 నుంచి చిరంజీవి 150వ చిత్రం కూడా రెగ్యులర్ షూట్ మోదలవుతుండడంతో.. చరణ్ తన సినిమాను షెడ్యూల్ ను పోస్ట్ పోన్ చేసుకొని.. తన తండ్రి షూటింగ్ ను పర్యవేక్షించేందుకు మొగ్గు చూపడం విశేషం.

తండ్రిపై ప్రేమతో చరణ్ తీసుకొన్న నిర్ణయం కరక్టే కావచ్చు.. కానీ “బ్రూస్ లీ” లాంటి డిజాస్టర్ తర్వాత అతడి తదుపరి చిత్రం విడుదలలో మరీ ఎక్కువ ఆలస్యం ఉండకూడదన్న విషయం కూడా అతడు గమనిస్తే మంచిది!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus