చెర్రీ….డిజాస్టర్ మళ్ళీ వస్తుందా??
- December 21, 2016 / 02:07 PM ISTByFilmy Focus
టాలీవుడ్ టాప్ హీరోల్లో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఒకడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు…అయితే అదే క్రమంలో చెర్రీ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు..తాజాగా తాను నటించిన ధృవ తమిళ రీమేక్ అయినప్పటికీ ఇక్కడ తెలుగులో కూడా మంచి హిట్ సాధించి కలెక్షన్స్ విషయంలో దూసుకుపోతుంది….మిగిలిన సినిమాలు ఏమీ లేకపోవడం, ఈ సినిమాకు బాగా కలసి వచ్చిన విషయం. అయితే అదే క్రమంలో ఈ సినిమా ప్రభావం బాక్స్ ఆఫీస్ పై సంక్రాంతి వరకూ ఉంటుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు…ఇదిలా ఉంటే తాజాగా చెర్రీ డిజాస్టర్ ఒకటి మళ్లీ విడుదల కానుంది అని సినిమా సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న వార్త.
ఇంతకీ ఏమా సినిమా…అంటే…..ఒక్కసారి ఈ కధ చదవండి మీకే అర్ధం అవుతుంది. మెగా పవర్ స్టార్ కెరీర్ లో ఫ్యాన్స్ కూడా గుర్తుంచుకోలేని మూవీ తుఫాన్. హిందీ మూవీ జంజీర్ ను గా అదే పేరుతో బాలీవుడ్ లో రీమేక్ చేయగా తెలుగులో తుఫాన్ గా ఈ చిత్రం విడుదలైంది. ఇఫ్పుడీ సినిమా తమిళ్ లోకి సూపర్ పోలీస్ పేరుతో డబ్ అవుతోంది. ప్రధానంగా చెర్రీతో పాటు జంటగా ఈ సినిమాలో ప్రియాంక చోప్రా నటించడం అసలు కారణంగా చెప్పచ్చు. ఈ సినిమాను తమిళ్ లోకి సూపర్ పోలీస్ గా డబ్బింగ్ చేస్తున్నట్లు సమాచారం, ఇప్పటికీ పనులన్నీ పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా…మరి తమిళ తంబీలు ఈ సినిమాకు ఎలాంటి జడ్జ్మెంట్ ఇస్తారో చూదాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















