Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Focus » Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

  • June 6, 2026 / 10:25 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) బాక్సాఫీస్ గ్రాఫ్ ఎప్పుడూ ఇంట్రెస్టింగ్‌గానే ఉంటుంది. ఈ మధ్య కాలంలో కమర్షియల్ మాస్ సినిమాలతో పాటు ప్రయోగాత్మక సినిమాలు కూడా చేస్తూ గ్లోబల్ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో అతని బాక్సాఫీస్ గ్రాఫ్ కూడా హిట్టు, ప్లాపు అనే తేడా లేకుండా పెరుగుతూనే ఉంది. రూ. 50 కోట్ల మార్కెట్ నుండి ఇప్పుడు ఏకంగా రూ. 500 కోట్ల అతని సినిమాల స్థాయి పెరిగింది అంటే అతిశయోక్తి అనిపించుకోదు.

Ram Charan

రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా 2 రోజుల క్రితం రిలీజ్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద సక్సెస్ఫుల్ గా దూసుకుపోతుంది. ఈ సందర్భంగా ఒకసారి రామ్ చరణ్ గత 10 సినిమాల బాక్సాఫీస్ ట్రాక్ రికార్డ్ ఎలా ఉందో ఓ లుక్కేద్దాం రండి :

1)తుఫాన్: రామ్ చరణ్ బాలీవుడ్ డెబ్యూ ఇస్తూ చేసిన బైలింగ్యువల్ మూవీ ఇది. బాలీవుడ్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ చరణ్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణపరాజయం పాలైంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. కానీ ఫైనల్ గా రూ. 18.2 కోట్ల షేర్‌ ను మాత్రమే సాధించి ఆ ఏడాది.. బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా మిగిలిపోయింది.

2) ఎవడు: దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రామ్ చరణ్ చేసిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. అల్లు అర్జున్ కూడా ఇందులో గెస్ట్ రోల్ చేశాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ. 44.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. ఫుల్ రన్‌ ముగిసేసరికి రూ. 47.10 కోట్లు షేర్ ను రాబట్టి.. బయ్యర్లకు రూ. 2.6 కోట్ల లాభాలు మిగిల్చి డీసెంట్ హిట్ అనిపించుకుంది. మహేష్ బాబు ‘1 నేనొక్కడినే’ సినిమాకి పోటీగా రిలీజ్ అయ్యి మరీ ‘ఎవడు’ విజయం సాధించడం విశేషంగా చెప్పుకోవాలి.

Ram Charan was not the first choice for Govindudu Andarivadele movie1

3)గోవిందుడు అందరివాడేలే: క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ… రామ్ చరణ్ తో తెరకెక్కించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘గోవిందుడు అందరివాడేలే’.బండ్ల గణేష్ నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 48 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా కేవలం రూ. 41 కోట్ల షేర్‌ ను మాత్రమే రాబట్టి.. రూ.7 కోట్ల స్వల్ప నష్టాలతో యావరేజ్ గా మిగిలింది.

4)బ్రూస్ లీ: శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్ చరణ్ చేసిన ఈ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీని డీవీవీ దానయ్య నిర్మించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 59 కోట్ల టార్గెట్‌ తో బరిలోకి దిగింది. కానీ ఫుల్ రన్లో కేవలం రూ. 39 కోట్లు షేర్ ను మాత్రమే రాబట్టి.. డిజాస్టర్ గా మిగిలింది.

Dhruva

5) ధృవ: సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘ధృవ’. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘తని ఒరువన్’ కి ఇది రీమేక్. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ. 60 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. కానీ ఫుల్ రన్లో కేవలం రూ.55 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. ఈ సినిమా నోట్ల రద్దు టైంలో రిలీజ్ అవ్వడం వల్ల.. బాక్సాఫీస్ వద్ద అనుకున్న ఫలితాన్ని సాధించలేకపోయింది అని చెప్పాలి. వేరే టైంలో రిలీజ్ అయ్యి ఉంటే కచ్చితంగా బయ్యర్స్ కి లాభాలు మిగిల్చి ఉండేది.

6)రంగస్థలం: రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పీరియాడిక్ మూవీ ఇది. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.80.36 కోట్ల బ్రేక్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఏకంగా రూ. 119 కోట్ల షేర్ ను రాబట్టి.. రీజనల్ సినిమాల్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

7)వినయ విధేయ రామ: మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో రామ్ చరణ్ చేసిన సినిమా ఇది. ‘రంగస్థలం’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రూపొందిన ఈ సినిమాకి మంచి హైప్ ఉంది. సంక్రాంతి సీజన్లో రిలీజ్ అయిన ఈ సినిమా రూ.90 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే ఫుల్ రన్లో కేవలం రూ.61 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి డిజాస్టర్ గా మిగిలింది.

8) ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుధిరం): రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో కలిసి రామ్ చరణ్ చేసిన సినిమా ఇది. బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ సినిమా.. ఫుల్ రన్ ముగిసేసరికి ఏకంగా రూ. 656 కోట్ల షేర్ ను సాధించింది. రూ. 156 కోట్ల లాభాలతో ఆ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

A shocking story behind Veerabhadra and Acharya movies

9) ఆచార్య: మెగాస్టార్ చిరంజీవి- కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన ‘ఆచార్య’ చిత్రంలో రామ్ చరణ్ సిద్ధ అనే పాత్రలో నటించాడు. రూ.134 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.48 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది.

10) గేమ్ ఛేంజర్: శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేసిన ఈ పొలిటికల్ అండ్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద రూ. 255 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా కేవలం రూ. 104.8 కోట్ల షేర్ ను మాత్రమే కలెక్ట్ చేసి.. బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా ఇచ్చిన షాక్ నుండి నిర్మాత దిల్ రాజు ఇంకా కోలుకోలేదు అంటే అతిశయోక్తి అనిపించుకోదు.

‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

Also Read

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

trending news

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

4 hours ago
Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

5 hours ago
Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

20 hours ago
Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

21 hours ago

latest news

Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

14 mins ago
Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

1 hour ago
Ticket Price: అన్నట్లే లెటర్‌ రాసేసిన ఎగ్జిబిటర్లు.. లేఖలో ఏం రాశారంటే?

Ticket Price: అన్నట్లే లెటర్‌ రాసేసిన ఎగ్జిబిటర్లు.. లేఖలో ఏం రాశారంటే?

2 hours ago
Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

3 hours ago
Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version