ఎనర్జిటిక్ హీరో రామ్ కెరీర్ ఒక హిట్ రెండు ప్లాప్ లు అనే విధంగా సాగుతోంది. రీసెంట్ గా నేను శైలజ సినిమాతో హిట్ కొట్టిన రామ్ తరవాత హైపర్ మూవీతో అపజయాన్ని అందుకున్నారు. మళ్ళి తన సినిమా ఎక్కడ ప్లాప్ అవుతుందనే భయంతో ఎక్కువరోజులు అలోచించి మంచి కథను ఎంచుకున్నారు. నేను శైలజను డైరక్ట్ చేసిన కిశోర్ తిరుమల డైరెక్షన్లోనే మరో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే 60 శాతానికిపైగా షూటింగ్‌ను పూర్తి చేసుకుని, త్వరలో టాకీ పార్ట్ కంప్లీట్ చేసే దశకు చేరుకుంది. ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్న ఈ సినిమా రిలీజ్ విషయంలో నిర్మాత స్రవంతి రవికిశోర్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.
దసరాకి రామ్ మూవీని విడుదల చేయనున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 21 ఎన్టీఆర్ జై లవకుశ మూవీ థియేటర్లోకి వస్తోంది. ఆగస్టు 27 న మహేష్ స్పైడర్ మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాల మధ్యలో వస్తే కలక్షన్స్ పై ప్రభావం ఉండదని బాలయ్య పైసా వసూల్ ని సెప్టెంబర్ మొదటి వారానికి నిర్మాతలు షిఫ్ట్ చేశారు. స్రవంతి రవికిశోర్ మాత్రం ఎన్టీఆర్, మహేష్ సినిమాల మధ్యలో రామ్ మూవీని విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు. ఈ పోటీ రామ్ కి కలిసి వస్తుందా.. కష్టాలు తెచ్చిపెడుతోందో కాలమే చెప్పాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.