రాంగోపాల్ వర్మ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్లో ఉన్న టాప్ టెక్నీషియన్స్ లో ఇతను కూడా ఒకడు. బాలీవుడ్లో కూడా సత్తా చాటాడు. టెక్నాలజీని ఎలా వాడుకోవాలో, సినిమాకి పబ్లిసిటీ ఎలా చేసుకోవాలో ఆర్జీవీకి తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలీదు అనడంలో అతిశయోక్తి ఎంత మాత్రమూ లేదు. ఈ మధ్యనే బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్ పాయ్ ఓ గొప్ప మాట చెప్పాడు రాంగోపాల్ వర్మ గురించి. అతను గతంలో బాలీవుడ్ సినిమాల్లో కీలక మార్పులు తెచ్చాడట.
అక్కడి ఫిలిం మేకింగ్ ను కంప్లీట్ గా మార్చేసాడని.. ‘సత్య’ లాంటి సినిమాలు తీసినా దెయ్యాల సినిమాలు తీసినా రాంగోపాల్ వర్మని మించి ఎవ్వరూ తీయలేరు అన్నట్టు అతను చెప్పుకొచ్చాడు. రాంగోపాల్ వర్మ వేసిన దారిలోనే అక్కడి ఫిలిం మేకర్స్ ఇప్పటికీ సినిమాలు చేస్తున్నారని అతను చెప్పుకొచ్చాడు. కానీ ఇక్కడ మాత్రం రాంగోపాల్ వర్మ ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు. అషు రెడ్డి లాంటి బుల్లితెర భామల కాళ్ళు నాకుతూ అతను ఎంజాయ్ చేస్తున్నాడు. చెబితే వినేరకం కాదు.
ఎటువంటి ప్రశ్న వేసినా.. ఆ ప్రశ్న ఎందుకు వేశామా అనుకునేలా మాట్లాడతాడు (Ram Gopal Varma) రాంగోపాల్ వర్మ. ఈసారి కూడా ఇలానే జరిగింది. “ఈ మధ్య కాలంలో నా సినిమాల్లో తెచ్చినవి ఒక్కటి కూడా లేదు . అయినా ఇంత పెద్ద ఆఫీసు బిల్డింగ్ కట్టడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని మీరు అడుగుతున్నారు .. నాకు దావూద్ ఇబ్రహీం ఇచ్చాడు. నాకు ఎవరైనా ఎందుకు డబ్బులు ఇస్తారు? ఎందుకు ఇవ్వాలి? అమ్మాయిల కాళ్లు నాకడమేంటని అడుగుతున్నారు ..
నాకు కాళ్ల టేస్టు అంటే ఇష్టం .. మీకు జామకాయలు అంటే ఎలా ఇష్టమో .. అలాగే… నాకు కాళ్ళ టేస్ట్ అంటే ఇష్టం. నాకు నచ్చినట్టుగా నేను బ్రతుకుతా .. నాకు నచ్చినట్టు చేస్తా.ఇప్పటికి వెయ్యిసార్లు చెప్పాను. అయినా మళ్లీ ఎందుకండీ ఇలాంటి ప్రశ్నలు వేస్తారు?” అంటూ అసహనాన్ని వ్యక్తం చేశాడు ఆర్జీవీ.