రామ్ నెక్స్ట్ మూవీ ఫిక్స్

  • September 11, 2018 / 10:22 AM IST

ఎనర్జటిక్ హీరో రామ్ నేను శైలజ సినిమా తర్వాత రెండు అపజయాలను వెనకేసుకున్నారు. మంచి హిట్ అందుకోవాలని “నేను లోకల్” తో హిట్ ట్రాక్ లో ఉన్న త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతోన్న “హలో గురు ప్రేమ కోసమే” లో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రకాష్ రాజ్ కీలకరోల్ పోషిస్తున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 18వ తేదీన థియేటర్లోకి రానుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అదిరిపోయే పాటలను ఇచ్చినట్లు తెలిసింది. ఈ సినిమా పనులతో బిజీగా ఉన్న రామ్ తన తదుపరి చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

డైరక్టర్ పేరు బయటికి రాలేదు కానీ రామ్ పెద్దనాన్న స్రవంతి రవి కిషోరే ఈ చిత్రాన్ని నిర్మించనున్నారనేది ఖాయం అయింది. అయితే ఇది మల్టీ స్టారర్ మూవీ అంట. ఒక తమిళ హీరోతో కలిసి రామ్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఆ హీరోని ఒప్పించే పనిలోనే డైరక్టర్ ఉన్నట్టు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. ఒకే కాగానే అధికారికంగా ప్రకటించనున్నారు. ఇప్పుడు తెలుగులో మల్టీ స్టారర్ సినిమాల హవా నడుస్తోంది. నాగ్, నాని కలిసి దేవదాస్ చేస్తున్నారు. వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి F2 చేస్తున్నారు. ఇవి హిట్ అయితే రామ్ మల్టీ స్టారర్ మూవీపైన అంచనాలు పెరిగిపోనున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus