రామ్ పోతినేని బోయపాటి శ్రీను కాంబినేషన్లు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తాజా చిత్రం స్కంద. ఈ సినిమా అక్టోబర్ 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతు సందడి చేస్తున్నారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికి విడుదల చేసినటువంటి ట్రైలర్స్ కనుక చూస్తే సినిమా పై భారీ అంచనాలే పెరిగాయి.
గత కొద్ది రోజులుగా ఎలాంటి సక్సెస్ లేక ఈ సినిమాపై ఎన్నో అంచనా పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా లో రామ్ సరసన శ్రీ లీల నటించబోతున్నటువంటి నేపథ్యంలో సినిమాపై కూడా భారీగానే అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమా ప్రమోషన్లను కనుక గమనిస్తే రామ్ కాస్త శరీర బరువు పెరగారని చెప్పాలి. ఈ సినిమాలో తన పాత్రకు అనుగుణంగా బోయపాటి రామ్ ను శరీర బరువు పెరగాలని చెప్పడంతో ఈయన ఎంతో కష్టపడి భారీగా ఈ సినిమా కోసం శరీర బరువు పెరగారని తెలుస్తుంది.
ఈ సినిమా స్టార్టింగ్ మొదట్లో రామ్ 70 కిలోల బరువు ఉండగా ఈ సినిమాలో మాత్రం 84 కిలోలు ఉన్నారని ఈ సినిమా కోసం ఈయన ఏకంగా 14 కిలోల బరువు పెరగారని తెలుస్తుంది. ఈ విధంగా ఒక సినిమా కోసం ఈ స్థాయిలో శరీర బరువు పెరగడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి
అయితే రామ్ (Ram Pothineni) ఇలా బరువు పెరిగారు అంటే ఆయనకు సినిమా పట్ల ఎలాంటి డెడికేషన్ ఉందో ఇక్కడే అర్థమవుతుంది. మరి సినిమా కోసం ఇంతగా కష్టపడినటువంటి రామ్ ఈ సినిమాతో ఎంతో మంచి సక్సెస్ అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!