Ramba Oorvasi Menaka First Review: 5 ఏళ్ళ తర్వాత అల్లరి నరేష్ ఖాతాలో సాలిడ్ హిట్?!

అల్లరి నరేష్ ఖాతాలో హిట్టు పడి 5 ఏళ్ళు పూర్తికావస్తోంది. 2021 లో వచ్చిన ‘నాంది’ తో ఓ మంచి హిట్ అందుకున్నాడు అల్లరి నరేష్. ఆ తర్వాత చాలా సినిమాలు చేశాడు. కానీ ఏదీ బాక్సాఫీస్ వద్ద విజయవంతమైన సినిమాగా నిలవలేకపోయింది. వాస్తవానికి కామిడీకి కేర్ ఆఫ్ అడ్రెస్ అంటే అల్లరి నరేష్ అంటుంటారు. కానీ ‘ఆ జోనర్లో రొటీన్ అయిపోయాడు’ అనే కంప్లైంట్స్ వచ్చినప్పుడు ‘నాంది’ తో సీరియస్ టర్న్ తీసుకున్నాడు నరేష్. ‘నాంది’ హిట్ అవ్వడంతో వరుసగా అలాంటి సినిమాలే చేస్తూ వచ్చాడు.

Ramba Oorvasi Menaka

అయితే ఆడియన్స్ కి ఈ కొత్త నరేష్ కూడా ఒక రకంగా బోర్ కొట్టేసినట్టు భావించారు. మళ్ళీ కామిడీ సినిమాలో నరేష్ ను చూడాలనుకున్నారు. అందుకోసం ‘ఆ ఒక్కటీ అడక్కు'(Ramba Oorvasi Menaka) అనే సినిమా చేశాడు. కానీ అందులో కామిడీ పండలేదు. ఆశించిన ఫలితం దక్కలేదు. తర్వాత చేసిన ‘బచ్చలమల్లి’ ’12A రైల్వే కాలనీ’ సినిమాల సంగతి తెలిసిందే. అందుకే ఈసారి ‘రంభ ఊర్వశి మేనక’ అనే ఫుల్ లెంగ్త్ కామిడీ సినిమా చేశాడు. చంద్రమోహన్ చింతాడా.. ఈ చిత్రానికి దర్శకుడు.

రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘అన్నపూర్ణ స్టూడియోస్’ కూడా ఈ చిత్రాన్ని ప్రెజెంట్ చేయడంతో హోప్స్ పెరిగాయి. ఇక ఆల్రెడీ ఈ చిత్రాన్ని ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది పెద్దలకి చూపించడం జరిగింది. సినిమా చూసిన వారు అనంతరం తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. వారి టాక్ ప్రకారం సినిమా 2 గంటల 24 నిమిషాల నిడివి కలిగి ఉందట. ఫస్ట్ హాఫ్ లో నాన్ స్టాప్ గా వచ్చే కామిడీ సీన్స్ మంచి హై ఇస్తాయట. సెకండాఫ్ లో మధర్ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యింది అంటున్నారు.

ఓవరాల్..గా ‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ సినిమా అని, కచ్చితంగా నవ్వుకుని ఎంజాయ్ చేయొచ్చని అంటున్నారు. చూడాలి మరి రిలీజ్ రోజున ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో..!

స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus