టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఏ చిన్న అప్‌డేట్ అయినా అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. నిహారిక నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘రాకాస’ చిత్రం ప్రమోషన్లు లో భాగంగా, తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి, చెల్లెలు నిహారిక పంచుకున్న వ్యాఖ్యలు ఆన్లైన్ లో వైరల్ గా మారాయి.
ఇక విషయం ఏంటంటే.. రామ్ చరణ్ సోషల్ మీడియాకు ఎక్కువగా దూరంగా ఉంటారని, ఆ విషయాల్లో ఆయనకు పెద్దగా ఆసక్తి లేదని చెప్పుకొచ్చింది. ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. రామ్ చరణ్ కు మొబైల్ కూడా సరిగా వాడటం రాదట. ఇంతటి గ్లోబల్ గుర్తింపు పొందిన స్టార్‌కు సోషల్ మీడియా మీద అంతగా పట్టులేదా? అని అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అయితే చాలామంది దీనిని సరదా వ్యాఖ్యగా తీసుకుంటున్నారు. వ్యక్తిగతంగా సోషల్ మీడియాను ఎక్కువగా వాడకపోయినా, తన సినిమాల ద్వారా ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వడమే చరణ్ స్టైల్ అని అభిమానులు అంటున్నారు. ఖాళీ దొరికితే సమయం మొత్తం కుటుంబానికే కేటాయిస్తారట చరణ్. మొత్తానికి, ఒక చిన్న వ్యాఖ్యతోనే పెద్ద చర్చకు దారి తీసిన ఈ విషయం, ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
ఇది ఇలా ఉండగా.. ప్రస్తుతం రామ్ చరణ్ తన తాజా ప్రాజెక్ట్ ‘పెద్ది’ షూటింగ్ పనులతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా విడుదలపై పలు ఊహాగానాలు వినిపిస్తున్న సమయంలో, ఆయన స్వయంగా ఇది ఆలస్యం కావడం లేదని సూచించినట్టు సమాచారం. ఇదే విషయాన్ని నిహారిక కూడా ఒక ప్రెస్ మీట్‌లో ప్రస్తావించారు. తమ సినిమా ప్రమోషన్లలో భాగంగా చేసిన వీడియోలు మంచి రీచ్ సాధిస్తున్నాయని, అదే సందర్భంగా చరణ్ చెప్పిన మెసేజ్‌ను కూడా ప్రేక్షకులకు తెలియజేశామని ఆమె వెల్లడించారు.