Klin Kaara: లీకైన క్లిన్ కార ఫోటో…ఎంత ముద్దుగా ఉందో!

మెగా కుటుంబం మొత్తం ప్రస్తుతం వరుణ్ తేజ్ పెళ్లి వేడుకలలో ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. నవంబర్ ఒకటవ తేదీ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి వివాహం జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే మెగా కుటుంబ సభ్యులందరూ కూడా ఇటలీ చేరుకున్నారు. ఇలా మెగా కుటుంబ సభ్యులు అంతా కూడా ప్రస్తుతం ఇటలీలో ఎంతో సందడి చేస్తూ పెళ్లి పనులలో బిజీ అయ్యారు. ఈ క్రమంలోనే వీరి ఇటలీకి సంబంధించిన ఫోటోలు అన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇలా ప్రతి ఒక్కరు కూడా ఇటలీలోని పెళ్లి వేడుకలకు అందించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే కొణిదెల కామినేని ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరూ కలిసి ఒకే ప్రేమ్ లో కనిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే వీరంతా కలిసి ముందు నీళ్లు ఉండగా పక్కనే అందరూ కలిసి ఫోటో దిగారు అయితే వీరందరూ ప్రతిబింబం నీటిలో స్పష్టంగా కనిపిస్తుంది.

ఇక ఈ ఫోటోలో చిన్నారి క్లిన్ కార కూడా ఉన్నారు అయితే ఇక్కడ తన ఫేస్ కనపడకుండా ఉపాసన రాంచరణ్ చాలా జాగ్రత్త పడ్డారు అయితే ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మెగా అభిమానులు ఈ ఫోటోని బాగా జూమ్ చేస్తూ రివర్స్ చేయగా నీటిలో కనిపించే ప్రతిబింబంలో క్లీన్ కారా ఫేస్ స్పష్టంగా కనపడుతుంది దీంతో మెగా వారసురాలి ఫోటో లీక్ అవ్వడంతో ఒక్కసారిగా ఈ ఫోటోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

ఇందుకు సంబంధించినటువంటి ఒక వీడియోని ట్విటర్ లో షేర్ చేయగా ఇది కాస్త వైరల్ గా మారింది. అంతేకాకుండా ఈ వీడియోని షేర్ చేస్తూ కాస్త చూసుకోవాలి కదా రామ్ చరణ్ గారు మా జాదుగాల్లు ఆవలిస్తే పేగులు లెక్కపెట్టే రకం అంటూ ఈ వీడియోని షేర్ చేస్తున్నారు. ఏది ఏమైనా మెగా వారసురాలి ఫోటో లీక్ అవడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫోటోలో చిన్నారి క్లీన్ కార (Klin Kaara) చూడటానికి చాలా ముద్దుగా క్యూట్ గా కనిపించడంతో ఈ ఫోటోని మరింత వైరల్ చేస్తున్నారు.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus