అది పూర్తి చేసేసరికి రెండు రోజులయ్యింది : రమ్యకృష్ణ

తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్ గా మాత్రమే కాకుండా మంచి నటిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది రమ్యకృష్ణ. ఆమె సినీ జీవితంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి అలరించారు. దేవత గా, డబ్బున్న అమ్మాయిగా, మధ్య తరగతి ఇల్లాలిగా, పొగరుబోతు అమ్మాయిగా ఇలా అనేక విభిన్న పాత్రల్లో నటించి మెప్పించారు. ‘నరసింహ’ చిత్రంలో నీలాంబరి గా… ‘బాహుబలి’లో ‘శివగామి’ గా రమ్యకృష్ణ నటన ఎప్పటికీ మరిచిపోలేనిది అనడంలో అతిశయోక్తి లేదు.

ఇదిలా ఉండగా ప్రస్తుతం రమ్యకృష్ణ ఓ ‘పోర్న్ స్టార్’ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రమ్యకృష్ణ ఏంటి? వేశ్య పాత్రలో నటించడమేంటి..? అంటూ ఆమె అభిమానులు షాక్ గి గురయ్యారు. కానీ ఆమె ఎంతో ఇష్టంతో ఈ పాత్ర చేస్తున్నట్టు తెలిపింది. తమిళ దర్శకుడు త్యాగరాజన్ కుమారరాజ రూపొందిస్తోన్న ‘సూపర్ డీలక్స్’ చిత్రంలో రమ్యకృష్ణ ఈ పాత్ర చేస్తుంది. విజయ్ సేతుపతి,సమంత ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు మంచి స్పందన లభించింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నరమ్యకృష్ణ ఈ చిత్రంలో తన పాత్రగురించి వెల్లడించింది. “ఇప్పటివరకూ నేను చేసిన పాత్రలు ఒక ఎత్తైతే.. ఈ పాత్ర మరో ఎత్తు. ఈ చిత్రంలో ఓ సీన్ కోసం ఏకంగా 37 టేకులు తీసుకున్నాను. ఆ సీన్ పూర్తి చేయడానికి రెండు రోజులు పట్టింది. అది చూసి సెట్ లో ఉన్నవారంతా షాక్ అయ్యారు. కొన్ని సినిమాలు డబ్బు కోసం చేస్తాం, మరికొన్ని పాపులారిటీ కోసం చేస్తాం, ఇంకొన్ని పేరు కోసం చేస్తాం.. కేవలం కొన్ని మాత్రమే ఇష్టంతో చేస్తాం.. అలా ఇష్టమైన వాటిలో నాకు ఈ చిత్రం కూడా ఉంది….” అంటూ చెప్పుకొచ్చారు రమ్యకృష్ణ.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus