నేనే రాజు నేనే మంత్రి అంటున్న రానా!

Advertisement

బాహుబలి లో విలన్ గా అలరించిన రానా మళ్లీ హీరోగా చిత్రాలు చేస్తున్నారు. బాహుబలి చిత్రీకరణ గ్యాప్ లోనే ‘ఘాజీ’ సినిమా షూటింగును పూర్తిచేసారు.  తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. 1971 వ సంవత్సరంలో ఇండియా-పాకిస్తాన్ యుద్ద కథాంశంతో డైరక్టర్ సంకల్ప్ రెడ్డి రూపొందించిన మూవీ రిలీజ్ కాకముందే రానా మరో సినిమాను ప్రారంభించారు. ప్రేమ కథా చిత్రాల డైరక్టర్ తేజ  దర్శకత్వంలో ఓ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ కి ఒకే చెప్పిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ నిన్న(మంగళవారం) అనంతపురంలో ప్రారంభమయింది. మొదటి రోజు షూటింగ్ విశేషాలను రానా నేడు ట్విట్టర్లో వెల్లడించారు.

ప్రజలకు అభివాదం చేస్తూ నడుచుకొస్తున్న ఫోటోను పంచుకున్నారు. ఈ చిత్రంలో టాలీవుడ్ యువరాణి కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. రానా పొలిటికల్ కథతో తొలి చిత్రం లీడర్ మూవీ చేశారు. తేజ దర్శకత్వంలో కాజల్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇలా హీరో హీరోయిన్ కి ఈ చిత్రం స్పెషల్. రానా మరో మారు నాయకుడిగా నటించడం, కాజల్ తేజ డైరక్షన్లో రెండో సారి నటిస్తుండడంతో ఈ మూవీపై అందరూ ఆసక్తిగా ఉన్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus