మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

ప్రముఖ బాలీవుడ్‌ కథానాయకుడు సల్మాన్‌ ఖాన్‌ చిక్కుల్లో పడ్డాడు. ‘బీయింగ్ హ్యూమన్’ జ్యువెలరీ షోరూమ్ పేరుతో మోసం చేశారనే ఆరోపణల నేపథ్యంలో సల్మాన్, ఆయన సోదరి అల్విరా ఖాన్‌కు కోర్టు నోటీసులు జారీ అయ్యాయి. చండీగఢ్ జిల్లా కోర్టు ఎదుట అక్టోబర్ 5న ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. వారితోపాటు ‘స్టైల్ & కంటెంట్ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్’ డైరెక్టర్లకు కూడా కోర్టు సమన్లు జారీ అయ్యాయి. దీనికి కారణం చండీగఢ్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ గుప్తా ఫిర్యాదు.

Salman Khan

అరుణ్ గుప్తా చండీగఢ్‌లోని మణిమజ్రా ప్రాంతంలో ‘బీయింగ్ హ్యూమన్’ జ్యువెలరీ షోరూమ్‌ ఏర్పాటు రూ.3 కోట్లు పెట్టుబడి పెట్టారట. అందులో షోరూమ్ డెవలప్‌మెంట్ కోసమే రూ.కోటి ఖర్చుచేశారట. బీయింగ్‌ హ్యూమన్‌ సంస్థతో ఒప్పందం ప్రకారం అన్ని నిబంధనలు పాటించినప్పటికీ, షోరూమ్ ప్రారంభించిన తర్వాత కంపెనీ నుండి బిజినెస్ సపోర్ట్ అందలేదని ఫిర్యాదులో అరుణ్‌ గుప్తా పేర్కొన్నారు. దీంతో తమ వ్యాపారం పూర్తిగా దెబ్బతిని నష్టం వచ్చిందని తెలిపారు.

అయితే, ఈ ఆరోపణలను బీయింగ్‌ హ్యూమన్‌ సంస్థ గతంలో ఒకసారి ఖండించింది. 2018లో స్థానిక వ్యాపారవేత్తతో జరిగిన ఒప్పందంలో సల్మాన్ ఖాన్‌కు ఎలాంటి ప్రత్యక్ష ప్రమేయం లేదని క్లారిటీ ఇచ్చింది. అయితే, ఇప్పడు న్యాయస్థానం ఈ కేసును విచారణకు తీసుకొని నోటీసులు జారీ చేసింది. సల్మాన్‌ ఇప్పుడు న్యాయస్థానానికి వస్తారా, లేక బయటనే మధ్యవర్తిత్వం ద్వారా ఈ విషయం తేల్చుకుంటారా అనేది చూడాలి.

ఇక సల్మాన్‌ సినిమా విషయాలకు వస్తే.. ‘మాతృభూమి’ అనే సినిమాను అపూర్వ లాఖియా తెరకెక్కిస్తున్న ఈ సినిమా వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఎప్పుడు రిలీజ్‌ చేస్తారో తెలియాల్సి ఉంది. ఇది కాకుండా దిల్ రాజు – వంశీ పైడి పల్లి కాంబినేషన్‌లో మరో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను వచ్చే రంజాన్‌కు రిలీజ్‌ చేయాలని చూస్తున్నారు. ఈ సినిమా కోసం సల్మాన్‌ బాగా బరువు తగ్గుతున్నాడు.

 ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus