స్టార్స్ ఫ్యామిలీ నుండి వచ్చిన వారసుల్లో ఎక్కువగా చిన్న వాళ్ళే క్లిక్ అయ్యారు. పెద్దవాళ్ళలో క్లిక్ అయ్యింది చాలా తక్కువ మందే అని చెప్పాలి. అందులో రానా ఒకడు. అతను కూడా స్టార్ అయితే కాలేదు. కానీ మంచి పెర్ఫార్మర్. తనకు నచ్చిన పాత్రలే చేస్తాడు. నిరంతరం కొత్తగా ఏదో ట్రై చేయాలని అనుకుంటాడు. అయితే అతని తమ్ముడు అభిరామ్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే.తేజ దర్శకత్వంలో అతను చేసిన ‘అహింస’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని చాలా కాలం అయ్యింది.
అయినా ఇంకా రిలీజ్ కాలేదు. సురేష్ బాబు అగ్ర నిర్మాత అలాగే పెద్ద డిస్ట్రిబ్యూటర్ కూడా. ఆయన తలుచుకుంటే ‘అహింస’ చిత్రాన్ని విడుదల చేయడం చాలా ఈజీ. కానీ ఎందుకో ఆయన ‘అభిరాం సినిమాని పట్టించుకోవడం లేదు. సినిమా బాగా రాలేదు అని తెలిస్తే ఆయన పట్టించుకోరు. బహుశా అందుకేనేమో డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ సినిమాని కొనుగోలు చేయడం లేదు. హీరోలో కూడా అంత స్పార్క్ ఉన్నట్లు కనిపించడం లేదు.
అయితే కిందా మీదా పడి ఈ చిత్రాన్ని ఏప్రిల్ 7న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.ఆ రోజున ఈ సినిమా నిజంగా రిలీజ్ అవుతుందా? లేక నామమాత్రంగా రిలీజ్ డేట్ ప్రకటించారా అన్నది ఆరోజే తెలుస్తుంది. ఒకవేళ అది నిజమే అయ్యుండి అదే రోజు కనుక ఈ సినిమా రిలీజ్ అయితే… ఈ సినిమాకి పెద్ద దెబ్బ పడటం ఖాయం. ఎందుకంటే ఓ పక్క రవితేజ నటించిన ‘రావణాసుర’ మరోపక్క కిరణ్ అబ్బవరం నటించిన ‘మీటర్’ సినిమాలు అదే రోజున రిలీజ్ కాబోతున్నాయి.
మరోపక్క ‘అహింస’ చిత్రానికి ప్రమోషన్లు కూడా మొదలుపెట్టలేదు. సురేష్ బాబు ఈ చిత్రాన్ని పుష్ చేయడానికి ముందుకొచ్చే అవకాశాలు కనిపించడం లేదు. వెంకటేష్ కు అయితే సురేష్ బాబు ఎంత చెబితే అంత. అందుకే రానా చొరవ చేసుకుని తమ్ముడి సినిమాని ప్రమోట్ చేసే బాధ్యత తీసుకుంటున్నాడని సమాచారం.
రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!
2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్