భల్లాలదేవుడి కంటే బలమైన ప్రతినాయకుడిగా

  • July 4, 2018 / 06:13 AM IST

“బాహుబలి” తర్వాత రాణా రేంజ్, రీచ్ ఏస్థాయిలో పెరిగిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈమధ్యకాలంలో రాణా నటిస్తున్న సినిమాలన్నీ కంపల్సరీగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కడమో లేక విడుదలవ్వాడమో జరుగుతున్నాయి. అయితే.. “బాహుబలి” తర్వాత మళ్ళీ ఓ సోషియో ఫాంటసీ ఫిలిమ్ చేయాలన్న కోరిక రాణాలో బలంగా పాతుకుపోయింది. ఆ విషయాన్ని అర్దం చేసుకొన్న గుణశేఖర్ రాణాను, అతడి డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ పరంగా అతడి ప్లస్ పాయింట్స్ ను దృష్టిలో పెట్టుకొని మన పురాణాల్లోని అత్యంత ప్రాముఖ్యమైన హిరణ్యకశ్యపుడి పాత్ర ఆధారంగా ఓ కథ రాసుకొన్నాడు.

పోరాణికాలు తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన గుణశేఖర్ ప్రతిభను నమ్మి ఈ ప్రొజెక్ట్ ను భారీ స్థాయిలో నిర్మించనున్నారు. సురేష్ బాబు ఈ క్రేజీ ప్రొజెక్ట్ కోసం ఏకంగా 180 కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యాడట. ఆల్రెడీ ప్రీప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తై ఉండడంతో.. సినిమా వచ్చే ఏడాది నుంచి సెట్స్ కు వెళ్ళే అవకాశం ఉంది. ఈలోపు రాణా తన కమిట్ మెంట్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని హిరణ్యకశ్యప పాత్ర కోసం ప్రిపేర్ అవ్వడం మొదలెడతాడట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus