ప్రభాస్ లాంటి నటుడిని నేను చూడలేదు : రానా
- September 9, 2017 / 11:26 AM ISTByFilmy Focus
తెలుగు చిత్ర పరిశ్రమ గురించి చెప్పగానే గుర్తుకువచ్చే సినిమాల పేర్లలో బాహుబలి ఒకటి. ఆ మూవీ పేరు చెప్పగానే అందులో బాహుబలి, భల్లాల దేవగా నటించిన ప్రభాస్, రానాలు కళ్లముందు కదలాడుతారు. ఆ చిత్రం కోసం ఇద్దరూ పోటీపడి నటించారు. ఈ చిత్రం తర్వాత ఇద్దరి రేంజ్ మారిపోయింది. సినిమాలు, షోస్, వెబ్ సిరీస్ లతో బిజీ అయిన రానా రీసెంట్ గా జాతీయ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ప్రభాస్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. “నా జీవితంలో ప్రభాస్ లాంటి మంచివ్యక్తిని మొదటిసారి కలిశాను. సినిమా కోసం విపరీతంగా శ్రమించడం ప్రభాస్ లక్షణం. సినిమానే ప్రేమిస్తూ.. దానికోసం ఏదైనా చేయగలగడం ఆయనలోని గొప్పతనం.
ఒక సినిమా కోసం ఏకంగా 5 సంవత్సరాలు కేటాయించడమనేది నమ్మశక్యంకాని విషయం.” అని వివరించారు. ఇంకా ఆనాటి సంగతులు గుర్తుచేసుకుంటూ.. “ప్రభాస్ సెట్ లో ఉన్నపుడు దర్శకుడు రాజమౌళిని డార్లింగ్ అని పిలుస్తూ.. సరదాగా ఉంటూ అందరిలో ఉత్సాహం నింపేవాడు. “బాహుబలి” సినిమాను చాలా నిజాయితీగా నమ్మి సినిమాకు మూలస్తంభం గా ప్రభాస్ నిలిచాడు’ అని రానా అభినందించారు. రానా ప్రస్తుతం నేనేరాజు నేనే మంత్రి మూవీ తర్వాత చేయబోయే కథ చర్చల్లో బిజీగా ఉన్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















