దగ్గుబాటి రానా,మిహీక.. టాలీవుడ్లో ఉన్న మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో ఒకరు. 2020 లాక్డౌన్ టైంలో వీళ్ళ పెళ్లి జరిగింది. రానా సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు.. కానీ అతని భార్య మిహీకా మాత్రం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ సందడి చేస్తుంది. ఇదిలా ఉండగా.. మిహీకా ఎక్కడ కనిపించినా ఆమె ప్రెగ్నెంట్ అంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.గతంలో కూడా ఇలాగే ప్రచారం జరిగితే ఆమె కాదు అంటూ క్లారిటీ ఇచ్చింది.
అయితే ఇటీవల ఆమె బీచ్ ఒడ్డున నడుస్తున్న ఓ వీడియో వైరల్ అయ్యింది. అందులో ఈమె బొద్దుగా ఉంది. దీంతో ఈమె గర్భవతి అంటూ మళ్ళీ ప్రచారం మొదలైంది. దీని పై మరోసారి మిహికా క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ‘నేను బొద్దుగా ఉన్న మాట నిజం. అయితే దానికి నేను ప్రెగ్నెంట్ అవ్వడం వల్లనే బొద్దుగా అయ్యాను అన్నది అబద్ధం. నేను వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నాను. అందువల్లనే ఇలా బొద్దుగా అయ్యాను.
నిజంగా నేను (Miheeka) ప్రెగ్నెంట్ అయితే ఆ వార్తను స్వయంగా నేనే మీతో షేర్ చేసుకుంటాను’ అంటూ మిహీకా చెప్పుకొచ్చింది. అలాగే ఓ అభిమాని ‘మీరు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారా?’ అని అడగ్గా… అందుకు ఆమె ‘నాకు నటన పై ఇంట్రెస్ట్ లేదు.’ అంటూ జవాబిచ్చింది. ఇక రానా, మిహీకా… 2020 ఆగస్టు 8న పెళ్లి చేసుకున్నారు. వీరిది ప్రేమ వివాహం అన్న సంగతి కూడా అందరికీ తెలిసిందే.