టీనేజ్ లో తీసుకున్న ఫోటోని షేర్ చేసిన రానా!
- October 23, 2017 / 10:43 AM ISTByFilmy Focus
రానా దగ్గుబాటి చిన్నప్పటి నుంచి సినీ వాతావరణంలో పెరిగారు. తన దగ్గుబాటి ఫ్యామిలీతోనే కాకుండా అక్కినేని కుటుంబ సభ్యులతో మంచి అనుబంధం ఉంది. అలాగే మెగా ఫ్యామిలీతో కలిసి మెలిసి ఉండేవారు. ఆ విషయాన్నీ ఒక ఫోటో ద్వారా మరో సారి రానా గుర్తుచేశారు. కొన్నేళ్ల క్రితం రామ్‌చరణ్, తరుణ్‌తో కలసి దిగిన ఓ ఫోటోను ఫేస్‌బుక్ లో పోస్ట్ చేశారు. అంతేకాదు మంచి కామెంట్ కూడా రాశారు. “ఈ ఫోటో చూస్తుంటే.. కొన్ని శతాబ్దాల క్రిందటి ఫొటోలా అనిపిస్తోంది నాకు.
దీనికి సంబంధించి నాకు ఏమీ గుర్తులేదు” అంటూ షేర్ చేశారు. ఇందులో రానాని మాత్రమే కాదు రామ్ చరణ్, తరుణ్ లను కూడా చెబితే తప్ప గుర్తుపట్టని విధంగా ఉన్నారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఎంత క్యూట్ గా ఉన్నారోనని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
















