Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

విజయ్ దేవరకొండ హిట్టు కొట్టి 8 ఏళ్లు కావస్తోంది. ‘టాక్సీవాలా’ తర్వాత విజయ్ దేవరకొండ ఖాతాలో ఒక్క హిట్టు కూడా పడలేదు. ‘డియర్ కామ్రేడ్’, ‘ఖుషి’, ‘కింగ్డమ్’ వంటి యావరేజ్ సినిమాలు పడినప్పటికీ.. మిగతావన్నీ దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలని ‘రణబాలి'(Ranabaali) సినిమాతో అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు విజయ్ దేవరకొండ. ఈ చిత్రాన్ని ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కించాడు.

Ranabaali First Review

చాలా గ్యాప్ తర్వాత రష్మికతో జోడీ కట్టాడు. ‘రణబాలి’ ప్రమోషనల్ కంటెంట్ పర్వాలేదు అనిపించినప్పటికీ.. ఈ సినిమాకి ఎక్కువ క్రేజ్ తీసుకొచ్చింది మాత్రం విజయ్-రష్మిక జోడీనే అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇదిలా ఉండగా.. ‘రణబాలి’ సినిమాని ఇప్పటికే మేకర్స్ స్పెషల్ షో వేసి ఇండస్ట్రీలోని పెద్దలకు చూపించడం జరిగింది. సినిమా చూసిన అనంతరం వారు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా ఎమోషనల్‌గా స్టార్ట్ అవుతుందట.

ఒక కొండపై ఈశ్వరీ రావు ట్రాక్, అలాగే లాల్ పాత్రతో కథ మొదలవుతుందట. విజువల్స్, ఆర్ట్ వర్క్ అన్నీ టాప్ నాచ్‌లో ఉంటాయట. విజయ్ దేవరకొండ ఎంట్రీ సీన్, రష్మిక మందన్నా క్యూట్ పెర్ఫార్మెన్స్, ‘ఏందయ్యా సామి’ సాంగ్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటాయట. సెకండాఫ్‌లో యాక్షన్ పార్ట్‌కి పెద్ద పీట వేసినట్టు చెబుతున్నారు. క్లైమాక్స్ ఎమోషనల్‌గా సాగుతుందట. కథ ఏ కొండ మీద అయితే మొదలైందో.. అదే కొండ మీద ముగుస్తుందని సినిమా చూసిన వారు చెప్పుకొచ్చారు. మరి రిలీజ్ రోజున ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus