Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం
- September 9, 2026 / 05:01 PM ISTByPhani Kumar
పెళ్ళి తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన కలిసి నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. ఈ కాంబోకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అందుకే ‘రణబాలి'(Ranabaali) ప్రాజెక్టు అనౌన్స్ చేసినప్పటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఆ అంచనాలు మరింతగా పెరిగాయి. అక్టోబర్ 16న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ,మలయాళం భాషల్లో ఏక కాలంలో విడుదల కానుంది. తాజాగా టీజర్ ను వదిలారు మేకర్స్.
Ranabaali

‘రణబాలి’ టీజర్ విషయానికి వస్తే ఇది.. 2 నిమిషాల 32 సెకన్ల నిడివి కలిగి ఉంది. ‘బ్రిటిష్ పాలనలో ప్రాణాలు కోల్పోయిన 80 లక్షల మంది భారతీయుల జ్ఞాపకార్థం (1876-78)’ అనే లైన్‌తో టీజర్ మొదలైంది. మద్రాస్ ప్రెసిడెన్సీ కాలంలో చోటుచేసుకున్న మహా కరువును కళ్లకు కట్టినట్లు చూపించారు. అన్నపూర్ణ లాంటి మన దేశంలో ప్రజలు ఆకలితో అల్లాడిపోవడం, గుక్కెడు నీళ్లు, పిడికెడు మెతుకుల కోసం పడే ఆవేదనను చాలా నేచురల్ గా అందరూ ఎమోషన్ కి గురయ్యేలా ప్రెజెంట్ చేశాడు దర్శకుడు.
మన భూములను, సంపదను దోచుకోవడమే కాకుండా మన ప్రజలు ఆఖలితో అల్లాడేలా చేసిన వైనాన్ని సైతం చూపించారు. బ్రిటిష్ వారి క్రూరత్వం, దాని వల్ల చోటు చేసుకున్న హింస నెక్స్ట్ లెవెల్లో చూపించారు. భారతీయులను బానిసలుగా చేసుకోవడానికి వారు సృష్టించిన మారణహోమం, రక్తపాతం మామూలుగా లేదు. అలాంటి బలహీనులకి అండగా నిలబడేందుకు వచ్చిన వీరుడిగా విజయ్ దేవరకొండని చూపించారు. విజయ్ దేవరకొండ లుక్ రస్టిక్ గా ఉంది అలాగే పవర్ఫుల్ గా కూడా ఉంది.
బ్రిటిష్ వాళ్ళే అతన్ని ఒక ‘రాక్షసుడు’గా ప్రస్తావించడం….ఆ తర్వాత ‘సింగనమల బొబ్బిలి రణబాలి’ అంటూ విజయ్ తన పాత్రని గంభీరంగా పరిచయం చేసుకోవడం అంతా టాప్ నాచ్ ఫీలింగ్ ఇస్తాయి. టీజర్ చివర్లో వచ్చిన ఓ విజువల్ హర్రర్ ఫీల్ కూడా ఇచ్చి.. సినిమాలో ఉన్న మరో కోణంపై హింట్ ఇచ్చినట్టు అయ్యింది.అజయ్-అతుల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, నిరావ్ షా సినిమాటోగ్రఫీ అందరినీ కట్టిపడేసే విధంగా ఉన్నాయి.
డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ టాలెంట్ ‘రణబాలి’ టీజర్..తో మరోసారి బయటపడింది. విజయ్ దేవరకొండకి ఈసారి స్ట్రాంగ్ కంబ్యాక్ దొరికేలా ఉంది. ఆలస్యం చేయకుండా ‘రణబాలి’ టీజర్ ను ఓ లుక్కేయండి :
















