Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

విజయ్ దేవరకొండ, రష్మిక కలయికలో ‘గీత గోవిందం’ ‘డియర్ కామ్రేడ్’ తర్వాత రూపొందిన మూడో చిత్రం ‘రణబాలి'(Ranabaali). పెళ్ళైన తర్వాత రష్మిక, విజయ్ దేవరకొండ కలిసి నటించిన సినిమా కావడంతో మొదటి నుండీ ఈ సినిమాపై ఆడియన్స్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. అందులోనూ ‘టాక్సీ వాలా’ తర్వాత దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ తో విజయ్ దేవరకొండ చేసిన సినిమా ఇది. ‘ఏందయ్యా సామి’ సాంగ్, టీజర్, ట్రైలర్ వంటి వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Ranabaali

కానీ సినిమాపై బజ్ అయితే క్రియేట్ అవ్వలేదు. అయితే ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు నిర్మించిన ఈ సినిమాకి ధియేట్రికల్ బిజినెస్ అయితే బాగానే జరిగింది. ఒకసారి వాటి వివరాలు అలాగే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతో తెలుసుకుందాం రండి :

నైజాం  10 cr
సీడెడ్  4 cr
ఆంధ్ర(టోటల్)  15 cr
ఏపీ + తెలంగాణ(టోటల్)  29 cr (షేర్)
రెస్ట్ ఆఫ్ ఇండియా  3 cr
ఓవర్సీస్  6 cr
వరల్డ్ వైడ్(టోటల్)  38 cr

‘రణబాలి’ చిత్రానికి రూ.38 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.39 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. ‘కింగ్డమ్’ కంటే కూడా ఈ సినిమాకి తక్కువ బిజినెసే జరిగింది. కానీ రిలీజ్ కి ముందు ఆ సినిమాకి ఉన్న హైప్.. ఈ సినిమాకి లేదు. అదే మైనస్. బ్రేక్ ఈవెన్ కోసం ఈ సినిమా రూ.39 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. పాజిటివ్ టాక్ కనుక తెచ్చుకుంటే దసరా సెలవుల అడ్వాంటేజ్ తో బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఉంటాయి. లేదు అంటే ‘జైలర్ 2’ కి అడ్వాంటేజ్ అవుతుంది.

రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus