Ranga Ranga Vaibhavanga Collections: డిజాస్టర్ దిశగా ‘రంగ రంగ వైభవంగా’..!

  • September 10, 2022 / 05:39 PM IST

‘ఉప్పెన’ కొండపొలం’ వంటి చిత్రాల అనంతరం మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ‘రంగ రంగ వైభవంగా’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘అర్జున్ రెడ్డి’ చిత్రాన్ని తమిళంలో ‘ఆదిత్య వర్మ’ గా రీమేక్ చేసి హిట్టు కొట్టిన గిరీశాయ ఈ చిత్రానికి దర్శకుడు. ‘రొమాంటిక్’ ఫేమ్ కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది. ‘శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర’ బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మొదటి షోతోనే నెగిటివ్ టాక్ ను మూటకట్టుకుంది.

దీంతో మొదటి వారం ఈ మూవీ చెప్పుకోదగ్గ కలెక్షన్లను నమోదు చేయలేకపోయింది.ఇక 8 వ రోజున కొత్త సినిమాలు రిలీజ్ అవ్వడంతో చాలా వరకు వాషౌట్ అయిపోయిందనే చెప్పాలి. ఒకసారి 8 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 1.10 cr
సీడెడ్ 0.30 cr
ఉత్తరాంధ్ర 0.38 cr
ఈస్ట్ 0.33 cr
వెస్ట్ 0.20 cr
గుంటూరు 0.32 cr
కృష్ణా 0.27 cr
నెల్లూరు 0.17 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 3.07 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.22 cr
ఓవర్సీస్ 0.51 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 3.80 cr

‘రంగ రంగ వైభవంగా’ చిత్రానికి రూ.8.12 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.8.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఇది చాలా ఈజీ టార్గెట్. కానీ సినిమాకి నెగిటివ్ టాక్ రావడంతో 8 రోజులు పూర్తయ్యేసరికి కేవలం రూ.3.8 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.

బ్రేక్ ఈవెన్ కి మరో రూ.4.7 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.అది అసాధ్యమని తేలిపోయింది.అయితే ఈ మూవీకి ఈ వీకెండ్ కూడా 60 కి పైగా థియేటర్లలో రన్ అవుతుంది. కాబట్టి.. ఈ రెండు రోజులు క్యాష్ చేసుకునే అవకాశం అయితే ఉంది.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus