Rangamarthanda Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత చేతులెత్తేసిన ‘రంగమార్తాండ’ ..!

  • March 29, 2023 / 05:02 PM IST

‘హౌస్‌ఫుల్ మూవీస్’, ‘రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్’ బ్యానర్ల పై కాలిపు మధు, ఎస్. వెంకట్‌రెడ్డి నిర్మాణంలో కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రంగమార్తాండ’. ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ, అనసూయ, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక, రాహుల్ సిప్లిగంజ్, బ్రహ్మానందం వంటి వారు కీలక పాత్రలు పోషించారు. మార్చ్ 22న ఉగాది కానుకగా ఈ చిత్రం విడుదల అయ్యింది. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసింది.

మొదటిరోజు ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. ప్రమోషన్ పెద్దగా చేయకపోయినా మొదటి రోజు పర్వాలేదు అనిపించే విధంగా కలెక్ట్ చేసిన ఈ మూవీ.. 5 రోజుల వరకు బాగానే క్యాష్ చేసుకుంది.అంటే వీకెండ్ వరకు అన్న మాట. అయితే సోమవారం, మంగళవారం నాడు మాత్రం ఈ సినిమా చాలా వరకు డౌన్ అయిపోయింది. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.83 cr
సీడెడ్ 0.17 cr
ఉత్తరాంధ్ర 0.24 cr
ఈస్ట్ 0.13 cr
వెస్ట్ 0.07 cr
గుంటూరు 0.12 cr
కృష్ణా 0.14 cr
నెల్లూరు 0.08 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 1.78 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.12 cr
వరల్డ్ వైడ్ (టోటల్ ) 1.90 cr

‘రంగమార్తాండ’ చిత్రానికి రూ.2.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. చాలా వరకు మైత్రి వారే ఓన్ రిలీజ్ చేసుకున్నారు. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కు రూ.2.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.1.90 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.0.60 కోట్ల షేర్ ను రాబట్టాలి.

రేపు ‘దసరా’ చిత్రం థియేటర్లలోకి రాబోతోంది కాబట్టి.. ‘రంగమార్తాండ'(Rangamarthanda) చిత్రం నిలబడటం కష్టమనే చెప్పాలి. ఫైనల్ గా ఈ మూవీ కమర్షియల్ గా యావరేజ్ రిజల్ట్ తోనే సరిపెట్టుకోవాలి.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus