Ranveer – Deepika Daughter: రణ్‌వీర్‌ – దీపిక కూతురు ఫొటో అఫీషియల్‌ రిలీజ్‌.. సో క్యూట్‌ బేబీ!

బాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ రణ్‌వీర్‌ సింగ్‌, దీపక పడుకొణె ఇటీవల తల్లిదండ్రులు అయిన విషయం తెలిసిందే. గతేడాది దీపిక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అప్పటి నుండి బిడ్డను మీడియా కంట పడకుండా జాగ్రత్త పడ్డారు. అయితే అనూహ్యంగా దీపావళి సందర్భంగా తమ గారాల పట్టీ లుక్‌ను రివీల్‌ చేశారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో కొన్ని ఫొటోలు షేర్‌ చేశారు. పాప అయితే సూపర్‌ క్యూట్‌గా ఉంది. దీంతో ఫొటోలు వైరల్‌గా మారాయి.

Ranveer – Deepika Daughter

మమ్మీ, డాటర్‌ సేమ్‌ పించ్‌ అనేలా దీపిక, దువా మెరూన్‌ కలర్‌ ట్రెడిషనల్‌ వేర్‌లో అదరగొట్టగా.. రణ్‌వీర్‌ సింగ్‌ వైట్‌ కుర్తాలో మెరిసిపోయాడు. 2018లో వివాహం చేసుకున్న దీపిక, రణ్‌వీర్ దంపతులకు సెప్టెంబర్ 8, 2024న దువా జన్మించింది. గత దీపావళి సందర్భంగా బిడ్డ పేరును ప్రకటించిన రణ్‌వీర్‌, దీపిక.. ఈసారి ఫొటోను రిలీజ్‌ చేశారు. ఇక దువా అంటే ప్రార్థన అని అర్థం. మా చిన్నారి మా ప్రార్థనలకు సమాధానం అంటూ పేరు అనౌన్స్‌ చేసినప్పుడు ఈ దంపతులు సోషల్‌ మీడియాలో రాసుకొచ్చారు.

దువా ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లతోపాటు సెలబ్రిటీలు కూడా ఆ ఫొటోలకు కామెంట్లు పెడుతున్నారు. చాలా మంది సెలబ్రిటీలు తమ బిడ్డల ఫొటోలను చాలా ఏళ్లపాటు మీడియా కంట పడకుండా ఆపుతున్నారు. ప్రైవసీ కోసమే ఇలా చేశాం అని చెబుతున్నారు. అయితే పుట్టిన ఏడాదికే దువా ఫొటోను దీపిక, రణ్‌వీర్‌ రిలీజ్‌ చేయడం గమనార్హం. ఇంకెన్నాళ్లు దాస్తాం అని అనుకున్నారేమో మరి.

ఇక కొంతమంది అయితే ఈ చిన్నారి కోసమే దీపిక వరుస సినిమాలు వదులకుంటోంది.. బిడ్డ కోసం సూపర్‌ డెసిషన్‌ అంటూ సినిమాల విషయాలను లాగుతున్నారు. ఇక దీపిక సినిమాల సంగతి చూస్తే.. ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత ఓకే చేసిన ‘స్పిరిట్‌’, ‘కల్కి 2’ సినిమాల నుండి తప్పుకుంది.

ధృవ్‌ విక్రమ్‌ కోరిక అదిరింది.. తెలుగులో స్పీచ్‌ అదరగొట్టాడుగా!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus