Dhruv Vikram: ధృవ్‌ విక్రమ్‌ కోరిక అదిరింది.. తెలుగులో స్పీచ్‌ అదరగొట్టాడుగా!

‘బైసన్‌’ అంటూ ఇటీవల దీపావళికి కోలీవుడ్‌కి వచ్చిన ధ్రువ్‌ విక్రమ్‌ ఇప్పుడు టాలీవుడ్‌కి కూడా రాబోతున్నాడు. ఈ నెల 24న సినిమాను తెలుగులో రిలీజ్‌ చేయబోతున్నారు. ఈ మేరకు సినిమా టీమ్‌ మీడియా ముందుకు వచ్చింది. ఈ క్రమంలో ధ్రువ్‌ విక్రమ్‌ తొలిసారి తెలుగులో మాట్లాడాడు. అంతేకాదు తన తండ్రి గురించి, తన గురించి, తనకు పుట్టబోయే బిడ్డ గురించి కూడా మాట్లాడాడు. అదేంటి బిడ్డ గురించి అనుకుంటున్నారా? అక్కడే ఉంది ట్విస్ట్‌.. తనకు జరిగిందే, తన బిడ్డకు జరగాలని కోరుకుంటున్నాడు. ఇంతకీ ఏమైందంటే?

Dhruv Vikram

తెలుగు సినిమా పరిశ్రమలో తమ సినిమా ప్రచారం కోసం వచ్చి… తెలుగులో కాకుండా ఇతర భాషల్లో మాట్లాడుతుంటారు కొంతమంది. తెలుగు వచ్చినా ఒక్క ముక్క కూడా తెలుగులో మాట్లాడని నటులు ఉన్న పరిశ్రమ మనది. అయితే తమిళ బేస్‌ ఉన్న ధ్రువ్‌ విక్రమ్‌ తెలుగు స్పీచ్‌ను రాసుకొని వచ్చి మాట్లాడాడు. మే బీ ఆ స్పీచ్‌ను తమిళంలోనో, ఇంగ్లిష్‌లోనో రాసుకొని ఉండొచ్చు కానీ.. తెలుగు పదాలను ఓ తమిళ హీరో పలకడం అయితే సూపర్‌ అనే చెప్పాలి. ఈ క్రమంలోనే తనకు రీసెంట్‌గా ఎదురైన ఓ అద్భుతమైన ఫీలింగ్‌ గురించి చెప్పాడు.

ధ్రువ్‌ కొన్ని రోజుల క్రితం ఓ సూట్‌కేస్‌ కొందామని హైదరాబాద్‌లో ఓ షాపింగ్ మాల్‌కి వెళ్లాడట. ధ్రువ్‌ని గుర్తు పట్టిన కొంతమంది కుర్రాళ్లు ఆ షాప్‌ ముందు సందడి చేయడం మొదలుపెట్టారట. దానికి షాప్ ఓనర్ ‘బయట ఉన్నది మీ ఫ్రెండ్సా’ అని అడిగారట. కాదన్నాడట ధ్రువ్‌. కాసేపటి మీరు హీరో విక్రమ్‌లా ఉన్నారు అన్నాడట. దాంతో ‘నేను ఆయన కొడుకుని’ అని చెప్పాడట ధ్రువ్‌. దాంతో మీ నాన్న కష్టం, సినిమా కోసం ఆయన చేసే ప్రయోగాల బాగా ఇష్టం అని చెప్పాడట ఆ షాప్‌ అతను.

అలా కొన్నేళ్ల తర్వాత నా కొడుకు ఇలానే ఇక్కడకి షాపింగ్‌కి వస్తే.. ‘మీ నాన్న ధ్రువ్ అంటే చాలా ఇష్టం’ అని ఎవరైనా షాప్‌ అతను చెప్పాలి అనేదే ఆ కోరిక అని ధ్రువ్‌ తన మనసులో మాట చెప్పాడు. భలే ఉంది కదా ధ్రువ్‌ ఆలోచన. విక్రమ్‌ కొడుకు కదా అలానే మాట్లాడతాడులెండది. ఇక ధ్రువ్‌ స్పీచ్‌ని ‘హాయ్ నాన్న’ సినిమా డైరెక్టర్ శౌర్యువ్ రాసిచ్చారట. ధృవ్ తన భావాన్ని ఇంగ్లీష్‌లో రాసి ఇస్తే… తెలుగులోకి శౌర్యువ్ తర్జుమా చేసి ఇచ్చారట.

 మలయాళంలో వస్తే కల్ట్.. మనోళ్లు తీస్తే ల్యాగ్.. నాగవంశీ మాటల్లో వాస్తవమెంత?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus