అల్లు అర్జున్ టైమ్ బాలేదో లేక.. సినిమా మొదలెట్టిన ముహూర్తం బాగోలేదో తెలియదు కానీ.. అల్లు అర్జున్ 19వ సినిమా ప్రారంభమైనప్పట్నుంచి ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంది. మొన్నటివరకూ అసోసియేట్ డైరెక్టర్ కు అల్లు అర్జున్ కి పడక షూటింగ్ స్పాట్ లో పెద్ద రచ్చ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ గొడవల కారణంగా టాలెంటెడ్ ఆర్టిస్ట్ రావు రమేష్ సినిమా నుంచి తప్పుకొన్నాడని సమాచారం.
దాదాపు రెండు నెలల బల్క్ డేట్స్ ను అల్లు అర్జున్ సినిమా కోసం ఇచ్చిన రావు రమేష్.. షూటింగ్ సజావుగా సాగకపోతుండడంతోపాటు.. తన డేట్స్ వేస్ట్ అవుతుండడంతో వేరే మార్గం లేక సినిమా నుంచి తప్పుకొన్నాడట. దాంతో రావు రమేష్ స్థానంలో రైటర్ కమ్ యాక్టర్ హర్షవర్ధన్ ఆ పాత్రను పోషించడానికి వచ్చాడు. త్రివిక్రమ్ కి చాలా ఇష్టమైన ఆర్టిస్ట్ రావు రమేష్ కాబట్టి.. ఆ పాత్రను రీప్లేస్ చేసిన హర్షకి ఈ సినిమాలో మంచి పాత్ర దొరికినట్లే.