జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోల ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. సుధీర్ రష్మీ కలిసి స్కిట్లు చేసినా ఏదైనా సాంగ్ కు డ్యాన్స్ చేసినా నెటిజన్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. సుధీర్, రష్మీ కలిసి సినిమాలో నటిస్తే బాగుంటుందని సినిమాపై అంచనాలు సైతం పెరుగుతాయని కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. సుధీర్ రష్మీ జోడీకి ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది. అయితే తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో రిలీజ్ కాగా ఈ ప్రోమోలో రష్మీ రామ్ ప్రసాద్ చెల్లిగా పెళ్లికూతురు గెటప్ లో కనిపించారు.
రామ్ ప్రసాద్ మా చెల్లి ఎలా ఉందిరా అని సన్నీని అడగగా సన్నీ చాలా అందంగా ఉందని సమాధానం ఇస్తాడు. మేకప్ లేకపోతే యావరేజ్ అంటూ రామ్ ప్రసాద్ రష్మీ అందంపై సెటైర్లువేశారు. ఆ తర్వాత రష్మీ తాను ఒకడిని ప్రేమించానని తనకు పెళ్లి ఇష్టం లేదని రామ్ ప్రసాద్ తో చెబుతారు. ఆ తర్వాత రష్మీ నేను ఈ స్లీపింగ్ పిల్స్ మొత్తం తినేస్తానని రామ్ ప్రసాద్ తో చెప్పగా ఇంకో గంటలో పెళ్లి పెట్టుకుని పడుకుంటావా ఇప్పుడు అంటూ రామ్ ప్రసాద్ రష్మీపై పంచ్ వేస్తారు.
ఆ తర్వాత రష్మీ మనం మనస్పూర్తిగా ఒకరికి మనసు ఇస్తే ఈ గుండె చప్పుడు ఆగనంత వరకు ఈ మనస్సులో స్థానం వాళ్లకు మాత్రమే ఉంటుందని చెబుతారు. మనకు ఇష్టమైన వాళ్లు పక్కన లేకపోతే ఆ బాధ నాకు తెలుసని ఆమె కామెంట్లు చేయడంతో పాటు షోలో ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ ప్రోమోకు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి.
అయితే షోపై అంచనాలు పెంచడం కోసం, రేటింగ్ కోసం రష్మీని పెళ్లికూతురు గెటప్ లో చూపించారని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గతంతో పోలిస్తే ఎక్స్ట్రా జబర్దస్త్ షోకు రేటింగ్స్ తగ్గడం, చాలామంది కమెడియన్లు జబర్దస్త్ ను వీడుతున్న నేపథ్యంలో షో నిర్వాహకులు రేటింగ్ కోసం ఈ తరహా ప్రోమోలను రిలీజ్ చేస్తున్నారని బోగట్టా.