Rashmi: మాల్దీవుల్లో మత్స్యకన్యలా రష్మీ..వారం రోజులనుండి మాల్దీవ్స్‌లో ఏం చేస్తుందంటే..?

సెలబ్రిటీలు మాల్దీవుల్లాంటి ప్లేసుకి హాలీడే ట్రిప్ వేశారంటే మాత్రం ఆ మజాయే వేరుగా ఉంటుంది.. వాళ్లకి చాలా వరకు వీవీఐపీ ట్రీట్‌మెంట్, స్పెషల్ ప్యాకేజెస్..డిస్కౌంట్స్.. సాలిడ్ ఫెసిలిటీస్.. మామూలుగా ఉండదు ఆ వ్యవహారమంతా.. అక్కడి ప్రకృతి అందాలకు పరవశించడం మొదలెడితే అంత త్వరగా రాబుద్ది కాదు కూడా.. అందుకేనేమో మన స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ కొద్దిరోజులుగా మాల్దీవుల్లోనే మకాం వేసింది..

స్మాల్ స్క్రీన్ సెన్సేషన్ రష్మీ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.. టీవీ షోల్లో అమ్మడు ఉంటే ఆ సందడే వేరంటుంటారు ఫ్యాన్స్.. అప్పుడప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద కూడా మెరుస్తుంటుంది.. ‘గుంటూరు టాకీస్’ మూవీలో ఘాటైన అందాలతో కుర్రకారు గుండెల్ని పిండేసి, ఇటీవల ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ అంటూ వచ్చి మంచి హిట్ అందుకుంది.. ఎప్పుడూ షూటింగులతో క్షణం తీరిక లేకుండా గడిపే రష్మీ ప్రస్తుతం ప్రొఫెషనల్ లైఫ్ నుండి కాస్త బ్రేక్ తీసుకుని పర్సనల్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తోంది.

మొన్నటికి మొన్న చక్కటి సముద్రపు వాతావరణాన్ని ఆస్వాదిస్తూ.. బికినీలో స్విమ్మింగ్ పూల్‌లో సేదతీరుతూ ఉన్న ఓ కిరాక్ వీడియో ఇన్‌స్టాలో పోస్ట్ చేసి, సోషల్ మీడియాలో సెగల పొగలు రేపింది. బ్లూ కలర్ టూ పీస్ బికినీలో వాటర్ కలర్‌లో కలిసిపోయి, ఆ తడి అందాల్లో సాగరకన్యలా మెరిసిపోయింది. నీటిలో మునిగి రెండు చేతులతో లవ్ సింబల్ చూపిస్తూ.. ‘‘వన్స్ ఏ వాటర్ బేబీ.. ఆల్వేస్ ఏ వాటర్ బేబీ’’ అంటూ కామెంట్ కూడా చేసింది..

ఇక ఇప్పుడు మరికొన్ని అందాల బాణాలు.. అదేనండీ.. ఫోటోలు షేర్ చేసింది.. ప్రకృతి అందాలకు పరవశిస్తూ రష్మీ ఇచ్చిన ఫోజులు చూసి కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు. ‘ఇన్ని అందాల్నీ ఇన్నాళ్లూ ఇక్కడ దాచేసి, అక్కడకెళ్లి అందాల విందు చేస్తూ ఊరిస్తున్నావా?’ అంటూ బుంగమూతి పెడుతున్నారు. రష్మీ పోస్ట్ చేసిన లేటెస్ట్ మాల్దీవ్స్ పిక్స్ నెట్టింట వద్దన్నా వైరల్ అవుతున్నాయి. ఇక లైక్స్, కామెంట్స్ సంగతి కొత్తగా చెప్పక్కర్లేదనుకుంటా..

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus