Rashmi: సుధీర్ పై ప్రేమను బయటపెట్టిన రష్మీ.. ఎలా అంటే..?

  • May 13, 2021 / 08:22 PM IST

దాదాపు 8 సంవత్సరాలుగా బుల్లితెరపై సుధీర్ రష్మీ జోడీ హవా కొనసాగుతోంది. సుధీర్ రష్మీ కలిసి షోలు చేసినా, ఈవెంట్లు చేసినా వాటికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. సుధీర్, రష్మీ జోడీలా కొత్త జోడీలను క్రియేట్ చేయాలని ఛానెళ్ల నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నా ఈ జోడీ స్థాయిలో మరే జోడీ గుర్తింపును సంపాదించుకోవడం లేదు. తాజాగా ఢీ షో ప్రోమో రిలీజ్ కాగా సుధీర్ చెంపపై రష్మీ ఒక్కటిచ్చారు.

ప్రోమోలో రష్మీ నాకు సుధీర్ గారికి రెండు ఇవ్వాలని ఉందని చెప్పగా పూర్ణ సుధీర్ గారు అంటూ నవ్వుతూ గట్టిగా అరుస్తారు. ఆ తరువాత హైపర్ ఆది రష్మీ సుధీర్ కు ఇవ్వబోయే ఆ రెండూ ఏంటో తెలియాలని అన్నారు. రష్మీ హేయ్ రా..! అంటూ సుధీర్ ను స్టేజ్ పైకి పిలవగా సుధీర్ స్టేజ్ పైకి వస్తారు. ఫస్ట్ పర్ఫామెన్స్ సూపర్బ్ అంటూ రష్మీ సుధీర్ కు హగ్ ఇవ్వగా రష్మీ చేసిన పనితో టీమ్ లీడర్స్ తో పాటు కంటెస్టెంట్లు సైతం అవాక్కవుతారు.

ఆ తరువాత రష్మీ సుధీర్ చెంప పగులగొడతారు. రష్మీ వెంటనే సుధీర్ ను కొట్టడానికి గల కారణం చెబుతూ సుధీర్ కు కాలు బాగాలేదని అయినప్పటికీ జనాలకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి సుధీర్ ఎప్పటికీ వెనుకాడడని రష్మీ చెప్పుకొచ్చారు. ఆ తరువాత ఆది తాను దీపికా పిల్లికి రెండు ఇవ్వాలని అనుకుంటున్నానని డ్యాన్స్ బాగా చేసినందుకు దీపికా పిల్లికి హగ్ అని ఆ తరువాత దీపికా పిల్లికి చెయ్యి బాగాలేదని చెబుతూ హైపర్ ఆది నవ్వించారు.

ప్రోమోను చూసిన నెటిజన్లు సుధీర్ పై ఉన్న ప్రేమను రష్మీ హగ్ చేసుకొని బయటపెట్టారని కామెంట్లు చేస్తున్నారు. సంవత్సరం సంవత్సరానికి రష్మీ సుధీర్ జోడీకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుండటం గమనార్హం.


థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus