Rashmika: నాకు ఎక్కువగా సపోర్ట్‌ చేసింది అతనే… రష్మిక షాకింగ్‌ కామెంట్స్‌!

విజయ్‌ దేవరకొండ – రష్మిక మందన మధ్య ఉన్న బంధం ఏంటి? బాయ్‌ ఫ్రెండా? బాయ్‌ బెస్టీనా? లవరా? ఇదేంటి మళ్లీ పాత ప్రశ్నే వేస్తున్నారు. అయినా ఈ క్లారిటీ వాళ్లు ఇవ్వడం లేదు, మీరు ఎలా చెబుతారు లెండి. మాటలు చూస్తే ఫ్రెండ్‌ అనిపిస్తుంటుంది. చేతలు చూస్తే బాయ్‌ ఫ్రెండ్‌ అనిపిస్తుంటుంది. ఏవైనా టాక్‌ షోల్లో యితే ఏదో లవర్‌ అనే అనిపించేలా మాట్లాడుతుంటారు ఇద్దరూ. అయితే పెళ్లి పుకార్లు వచ్చినప్పుడు మాత్రం అబ్బే మా మధ్య ఏం లేదు అని చెబుతుంటారు.

ఆ విషయం పక్కన పెడితే.. తాజాగా రష్మిక మందన (Rashmika) మాట్లాడుతూ తనను ఎక్కువగా సపోర్ట్‌ చేసింది అతనే అంటూ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. ‘యానిమల్‌’ సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి మెప్పించిన రష్మిక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అమితాబ్‌ బచ్చన్‌, రణ్‌బీర్‌ కపూర్‌, అల్లు అర్జున్‌, విజయ్‌ దేవరకొండ, సిద్ధార్థ్‌ మల్హోత్ర గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.

అమితాబ్‌ బచ్చన్‌ తన తోటి నటీనటుల విషయంలో వయసులో వ్యత్యాసం చూడకుండా అందరినీ ఒకేలా గౌరవిస్తారని చెప్పింది రష్మిక. ఇక జీవితంలో ఏదైనా చేయగలననే నమ్మకాన్ని రణ్‌బీర్‌ ఇచ్చాడు అని చెప్పింది. తాను చేసే ప్రతి పనిలో కచ్చితంగా విజయ్‌ దేవరకొండ సహకారం ఉంటుంది అని చెప్పింది. అంతేకాదు ఏదైనా కొత్త పని తలపెడితే విజయ్‌ సలహా తీసుకుంటాను అని చెప్పింది. ఏది మంచి, ఏది చెడు అనేది విజయ్‌ చక్కగా చెబుతాడు అని తెలిపింది.

వ్యక్తిగతంగా జీవితంలో అందరికంటే ఎక్కువగా సపోర్ట్‌ చేసింది విజయ్ అంటూ క్లారిటీ ఇచ్చేసింది రష్మిక. దీంతో మరోసారి ఇద్దరి బంధం విషయంలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అంతగా సపోర్టు చేస్తున్న విజయ్‌కి తన లైఫ్‌లో రష్మిక ఎలాంటి స్థానం ఇచ్చింది అని అడుగుతున్నారు. మరి ఈ విషయంలోనూ క్లారిటీ ఇచ్చేస్తే ఫ్యాన్స్‌ హ్యాపీ కదా రష్మిక. అలాగే విజయ్‌ కూడా ఏదో మాట చెప్పేయాల్సిన సమయం వచ్చింది.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus