Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…
- October 5, 2026 / 05:49 PM ISTByFilmy Focus Desk
విజయ్ దేవరకొండ – రష్మిక మందన కాంబినేషన్‌లో చాలా రోజుల తర్వాత ఓ సినిమా రూపొందింది. పెళ్లి తర్వాత ఈ ఇద్దరూ కలసి నటిస్తున్న సినిమా ఇది. ఈ రెండు అంశాలతో టాలీవుడ్‌లో ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచిన సినిమా ‘రణబాలి’. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన ప్రచారం ఫుల్ జోష్‌లో సాగుతోంది. ఈ క్రమంలో ఇద్దరూ ఒకరిపై ఒకరు చేసుకుంటున్న కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.
Rashmika
అక్టోబర్ 16న విడుదల కానున్న నేపథ్యంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన, రాహుల్ సాంకృత్యాన్‌పై ఇటీవల సుమతో ఓ ఇంటర్వ్యూ చేయించి చిత్రబృందం మీడియా రిలీజ్ చేసింది. ఇంట్లో విజయ్ ఎలా ఉంటాడు అనే ప్రశ్నకు రష్మిక.. యాక్ట్ చేసి మరీ చూపించింది. తాను ‘బేబీ.. బేబీ’ అని పిలిచినా విజయ్ వెంటనే స్పందించడని, కానీ ‘ఒరేయ్’ అని పిలిస్తే వెంటనే పలుకుతాడని సరదాగా చెప్పుకొచ్చింది రష్మిక.
రష్మిక, విజయ్ మధ్య ప్రేమ గురించి పుకార్లులా వినడం తప్పా.. ఇద్దరూ ఎక్కడా అధికారికంగా వాళ్ల ప్రేమను చూపించలేదు. అక్కడక్కడా ఒకట్రెండు దగ్గర తప్ప. ఈ నేపథ్యంలో మీ ఇద్దరు ఇప్పుడు భార్యాభర్తలు కదా. మరి అప్పటి ప్రేమ ఇప్పుడూ ఉందా? పెళ్లి తర్వాత ఒక్కసారైనా ‘ఐ లవ్ యు’ చెప్పుకున్నారా? అనే ప్రశ్న ఎదురైంది వారికి. పెళ్లి తర్వాత కూడా భాగస్వామికి ‘ఐ లవ్ యు’ చెప్పడం ముఖ్యమంటోంది రష్మిక. ఇప్పటికీ విజయ్‌కి చెబుతుందట.
ఒకసారి, రెండు సార్లు కాదు, రోజులో ఓ 15 సార్లు చెబుతుందంట. మరి విజయ్ కూడా చెబుతాడా అని అడిగితే.. అతడు మరిచిపోతుంటాడు. మనసులో ప్రేమ ఉంటుందని కానీ, రష్మికకు ఆ విషయం తెలుసు కదా అని లైట్ తీసుకుంటాడట. అలా ఇప్పటికీ ఈ భార్యాభర్తలిద్దరూ తమ ప్రేమను వ్యక్తపరుస్తూనే ఉన్నారన్నమాట. ఇదొక మంచి కపుల్ లవ్లీ సీక్రెట్ అని చెప్పొచ్చు.
















