Rashmika: రష్మిక హిట్ అందుకుంటుందా..?

  • November 3, 2021 / 04:10 PM IST

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక.. ఇటీవలే బాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఈ ఏడాది ఆమె రెండు హిందీ సినిమాల్లో నటించింది. అయితే ఆ రెండు సినిమాలు కూడా వచ్చే ఏడాదిలోనే విడుదల కానున్నాయి. రష్మిక నటించిన మొదటి సినిమా ‘మిషన్ మజ్ను’. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తయింది. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

మే 13న, 2022లో సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాతో పాటు అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ‘గుడ్ బై’ సినిమాలో కూడా రష్మిక నటిస్తోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఇంకా ఫిక్స్ చేయలేదు. ప్రస్తుతం ఆమె మరో రెండు హిందీ సినిమాల్లో అవకాశాల కోసం చర్చలు జరుపుతోంది. అవి కూడా ఓకే అయ్యేలా ఉన్నాయని సమాచారం. తెలుగుతో పాటు హిందీ సినిమాలపై కూడా రష్మిక ఫోకస్ పెట్టింది.

ఫ్యూచర్ లో ఆమె బాలీవుడ్ లో సెటిల్ అయ్యే దిశగా అడుగులు వేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో ‘పుష్ప’, ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ వంటి సినిమాల్లో నటిస్తోంది. అలానే మరికొన్ని సినిమాలు చర్చల దశల్లో ఉన్నాయి.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus