Vijay – Rashmika: ఇది అనుకోకుండా తీసుకున్న నిర్ణయమన్న రష్మిక.. విజయ్‌ రింగ్‌ ఫొటో వైరల్‌!

ఇప్పుడు విజయ్‌ దేవరకొండ ఏం చేసినా, రష్మిక మందన ఏం పోస్టు చేసినా పెద్ద విషయమే అవుతుంది. ఎందుకంటే ఇద్దరి ఎంగేజ్‌మెంట్‌ జరిగింది అనే ఓ వార్త ఇటీవల బయటకు రావడమే. నిజంగానే ఎంగేజ్‌మెంట్‌ జరిగిందా లేదా అనేది టీమ్‌ అఫీషియల్‌గా చెప్పకపోయినా విజయ్‌ సన్నిహిత మీడియా బృందం అయితే రష్మిక – విజయ్‌కి శుభాకాంక్షలు తెలిపింది. అయితే ఆ ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ ఇదే అంటూ ఒక ఫొటో ఇప్పుడు బయటకు వచ్చింది. విజయ్‌ దేవరకొండ ఇటీవల పుట్టపర్తి వెళ్లాడు. అక్కడ అతనికి ఆహ్వానం పలికిన ఫొటోలు బయటకు వచ్చాయి.

Vijay – Rashmika

అందులో చేతి వేలికి ఓ ఉంగరం కనిపిచింది. అది ఎంగేజ్‌మెంట్‌ రింగే అని అంచనా వేస్తున్నారు. ఇక విజయ్‌ పుట్టపర్తి ఎందుకు వెళ్లాడు అనేదేగా డౌట్‌. విజయ్‌ కుటుంబం పుట్టపర్తి సత్యసాయిబాబు భక్తులు అని సమాచారం. చిన్నతనంలో బాబా గురించి చేసిన ఓ టీవీ వీడియోలో విజయ్‌ నటించాడు కూడా. ఆ తర్వాత ఎప్పుడూ పుట్టపర్తి వెళ్లినట్లు కనిపించలేదు కానీ.. ఇప్పుడు ఎంగేజ్‌మెంట్‌ తర్వాత వెళ్లాడు అని అర్థమవుతోంది. ఆ విషయం పక్కనపెడితే.. రష్మిక మందన ఇదే సమయంలో పెట్టిన ఓ సోషల్‌ మీడియా పోస్టు వైరల్‌గా మారింది.

నిజానికి, వాళ్ల ఎంగేజ్‌మెంట్‌కి, ఆ పోస్టుకు సంబంధం లేకపోయినా.. ఆమె కామెంట్‌ అలా ఉండటంతో వైరల్‌గా మారింది. ఎందుకంటే ‘ఇది అనుకోకుండా తీసుకున్న నిర్ణయం’ అని రష్మిక ఆ పోస్టులో రాసుకొచ్చింది. రష్మిక నటిస్తున్న ‘థామా’ సినిమా నుండి ‘నువ్వు నా సొంతమా..’ పాట విడుదలైంది. ఆ పాట గురించి చెబుతూ.. దాని వెనక ఉన్న కథను వివరించే ప్రయత్నం చేసింది. ఇది దర్శకనిర్మాతలు అనుకోకుండా తీసుకున్న నిర్ణయమని చెప్పింది. ఆ పాటో రష్మిక తన అందంతో, డ్యాన్స్‌ మూమెంట్స్‌తో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

12 రోజుల పాటు ఓ ప్రాంతంలో సినిమా షూటింగ్‌ చేశారట. ఆఖరి రోజున ఇక్కడే ఓ పాట తీస్తే ఎలా ఉంటుంది అని టీమ్‌కి ఆలోచన వచ్చిందట. దాంతో ఓ నాలుగు రోజులు రిహార్సిల్స్‌ చేసి ఈ పాటను షూట్‌ చేశామని రష్మిక చెప్పింది. పాటను చూసి అందరం ఆశ్చర్యపోయాం. ప్లాన్‌ చేసిన దాని కంటే బాగా వచ్చింది. మీరంతా కూడా థియేటర్‌లో ఈ సాంగ్‌ను ఎంజాయ్‌ చేస్తారు అని రష్మిక పోస్టులో పేర్కొంది.

3వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజులా కలెక్ట్ చేసింది

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus