నేషనల్ క్రష్ గా మారిపోయింది రష్మిక మందన. కన్నడతో పాటు తెలుగులో కూడా స్టార్ డమ్ ని సంపాదించుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు తన ఫుల్ ఫోకస్ బాలీవుడ్ పైనే పెట్టినట్టు స్పష్టమవుతుంది. అక్కడి జనాల కోసమే మునుపెన్నడూ లేని విధంగా ఈమె గ్లామర్ షో చేస్తుంది. ‘పుష్ప’ సినిమాతోనే అక్కడ ఓ రేంజ్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. డబ్బింగ్ సినిమాతోనే అంత క్రేజ్ వస్తే స్ట్రైట్ మూవీస్ తో మరింతగా కలిసొస్తుందని ఈమె భావిస్తున్నట్లు ఉంది.
ప్రస్తుతం ఈమె అక్కడ మిషన్ మజ్ను, గుడ్ బై వంటి చిత్రాల్లో నటిస్తుంది. అవి పూర్తయ్యేవరకు ఈమె మరో ప్రాజెక్టుకి సైన్ చేసే ఉద్దేశం లేదని చెబుతున్నట్టు టాక్. ఈ దశలో రష్మిక ఒకటి కాదు రెండు ఏకంగా 4 పెద్ద ప్రాజెక్టులకి నొ చెప్పిందట. తాజా సమాచారం ప్రకారం.. దిల్ రాజు నిర్మాణంలో విజయ్- వంశీ పైడిపల్లి కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీకి హీరోయిన్ గా రష్మిక మందనని అనుకున్నారట.
కానీ రష్మిక మాత్రం ఈ ప్రాజెక్టు చేయడానికి కాల్ షీట్లు ఖాళీ లేవని చెప్పి తప్పుకుందట. దీంతో కృతి సనన్ ను ఎంపిక చేసుకున్నారని తెలుస్తుంది. కృతి సనన్ తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమే. ‘1 నేనొక్కడినే’ ‘దోచేయ్’ వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ప్రభాస్ ‘ఆదిపురుష్’ లో నటిస్తుంది. ఇదిలా ఉండగా.. ఈ మధ్య కాలంలో రష్మిక వద్దనుకున్న సినిమా ఈ ఒక్కటే కాదు.కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ లో చరణ్ సరసన నటించే అవకాశం ముందుగా ఈమెకే వచ్చిందట.
కానీ ఈమె ఆ ప్రాజెక్టుకి నొ చెప్పింది. ఇక విజయ్ తో ‘బీస్ట్’ మూవీలో నటించే అవకాశాన్ని సంపాదించుకుంది. కానీ పారితోషికం విషయంలో మెలిక పెట్టి తప్పుకుందట. ఇటీవల రణబీర్ కపూర్- సందీప్ రెడ్డి వంగాల ‘యానిమల్’ లో కూడా ఈమెకు నటించే అవకాశం వచ్చినా.. దానికి కూడా నొ చెప్పినట్టు వార్తలు వచ్చాయి .