అభిమానుల్లో చర్చకి దారి తీసిన రష్మిక పచ్చబొట్టు

  • September 22, 2018 / 04:50 AM IST

ఛలో సినిమా ద్వారా తెలుగులో అడుగు పెట్టిన కన్నడ బ్యూటీ రష్మిక… గీత గోవిందం సినిమాతో మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆమె చేతినిండా సినిమాలున్నాయి. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగ్, నాని కలిసి చేస్తున్న మల్టీస్టారర్ మూవీలో రష్మిక మందన్న నటిస్తోంది. మరో హీరోయిన్ గా ఆకాంక్ష సింగ్‌ నటిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. ఈ సినిమా ఆడియో రిలీజ్ వేడుక నిన్న వైభవంగా జరిగింది. మణిశర్మ స్వరపరిచిన పాటలు హుషారు తెప్పిస్తున్నాయి. అయితే ఈ వేడుకలో రష్మిక సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయింది. కారణం ఆమె ఎడమ చేతిపై ఉన్న పచ్చబొట్టు. ఇంగ్లీష్ లెటర్స్ లో ‘Irrepleceable’ అనే పదం పచ్చబొట్టుగా వేసుకుంది. అయితే ఈ ఇర్రిప్లేసబుల్ లో లాస్ట్ ఉండే “ఈ” ఆక్షరం నెత్తి మీద ఒక లవ్ సింబల్ ఉంది.

కొత్త టాటూ కావడంతో అదిప్పుడు హాట్ టాపిక్ అయింది. కన్నడ నటుడు రక్షిత్ శెట్టి తో నిశ్చితార్ధం రద్దు అయిన తర్వాత రష్మిక హాజరయిన మొదటి పబ్లిక్ ఈవెంట్ ఇదే. దీంతో రక్షిత్ శెట్టి తో బ్రేకప్ విషయం ఆమెకు ఎంతో బాధ కలిగించిందని అందుకే అలాంటి టాటూ వేయించుకుందని కొందరు నెటిజనులు అర్థాలు చెప్తున్నారు. మరికొంతమంది మాత్రం ఈ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తిని ప్రేమిస్తుందా? అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. అసలు రష్మిక ఏ ఉద్దేశంతో ఆ టాటూ ను వేయిచుకుందో మనకు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. మీడియా ముందుకు వచ్చినప్పుడు టాటూ సీక్రెట్ చెప్పకుండా తప్పించుకోలేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus