Sivaji: మూడు రోజులు నిద్రపోలేదు: శివాజీ కామెంట్స్‌ వైరల్‌

చెప్పాలనుకున్న విషయం మంచిదే అయినా, చెప్పే విధానం సరిగ్గా లేకపోతే అసలుకు మోసం వస్తుంది అంటారు పెద్దలు. దీనికి నిలువెత్తు ఉదాహరణ కావాలి అంటే రీసెంట్‌గా జరిగిన శివాజీ విషయం చూస్తే సరి. బయటకు వచ్చేటప్పుడు హీరోయిన్లు ఎలాంటి వస్త్రధారణలో వస్తే మంచిది అని ఆయన చెప్పబోతూ.. కొన్ని ఇబ్బందికర మాటలు ఆడారు. వాటి విషయంలో చాలా పెద్ద బ్యాక్‌లాష్‌ వచ్చింది. వాదనలు, చర్చలు, రచ్చలు అన్నీ జరిగాయి. ఆఖరికి ఆయన తన మాటలు వెనక్కి తీసుకునేంత పరిస్థితి ఏర్పడింది.

Sivaji

ఇది జరిగి కొద్ది రోజులు అయింది. అయితే ఇప్పుడు మరోసారి శివాజీ ఆ టాపిక్ గురించి మాట్లాడారు. ఇప్పుడు ఆయన చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మహిళల డ్రెస్‌ల ఆధారంగా వారి క్యారెక్టర్‌ను నిర్ణయించకూడదని శివాజీ ఇప్పుడు అన్నారు. గతంలో అమ్మాయిల దుస్తులపై ఆయన చేసిన కామెంట్స్‌ వైరల్‌ అయిన నేపథ్యంలో ఇప్పుడు ఇలా అనడం గమనార్హం. దుస్తుల గురించి తాను చెప్పిన మాటల ఉద్దేశం ఏంటో సమాజానికి తెలుసన్న శివాజీ.. ప్రజలు అర్థం చేసుకున్నారని చెప్పారు.

నేను డ్రెస్సింగ్‌ గురించి కామెంట్స్‌ చేసే సమయంలో రెండు పదాలు వాడాను. అవి వాడకుండా ఉండాల్సింది. ఇదే మాట గతంలోనూ చెప్పాను. నేనెప్పుడూ కంట్రోల్‌ లేకుండా మాట్లాడలేదు. ఆ రోజు అలా ఎందుకు మాట్లాడానో నాకు తెలియడం లేదు. అన్ని రోజులు మనవి కావు కదా.. నేను ఆ పదాలు ఎలా మాట్లాడానా? అని నాకే అనిపించింది. చాలా మానసిక సంఘర్షణకు గురయ్యాను. మూడు రోజులు నిద్ర పోలేదు. ఇప్పటి వరకూ నా జీవితంలో వందల ప్రెస్‌మీట్‌, డిబేట్‌లలో పాల్గొన్నాను. ఎప్పుడూ అలా నోరు జారలేదు. ఆ రోజు అలా జరిగిపోయింది అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు శివాజీ.

అలాగే అనసూయ టాపిక్‌ గురించి మాట్లాడారు. నేను అనసూయను ఏమీ అనలేదు. ఆమెతో నాకు పరిచయమూ తక్కువ. ఆమె ఎప్పుడో నన్ను ఒక ఇంటర్వ్యూ చేశారు అంతే. ఆ అమ్మాయి అంటే నాకు గౌరవం. ఈ ప్రపంచంలో మగవారు ఉద్దేశపూర్వకంగా ఆడవాళ్లను కించపరచాలని అనుకోరనేది నా అభిప్రాయం. మహిళా కమిషన్‌కు నేను వెళ్లినప్పుడు నాకు తెలిసినవాళ్లే నాపై కంప్లైంట్‌ చేశారని తెలిసింది. అప్పుడు షాక్‌ అయ్యాను. వాళ్ల పేర్లు ఇప్పుడు చెప్పను. అలా చెప్పడం కరెక్ట్‌ కాదు కూడా. వాళ్లంటే నాకు ఇప్పటికీ గౌరవం ఉంది అని శివాజీ చెప్పుకొచ్చారు.

ఆయన సినిమా మధ్యలో వదిలేశారు.. వీళ్లు ఫోన్లు ఎత్తడం లేదు!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus